అందుకే బాలీవుడ్ హీరోలు జ‌నాల్లోకి వెళ్ల‌రా?

బాలీవుడ్ హీరోల సినిమా ప్రచారం ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. రిలీజ్ కి ముందు సింపుల్ గా ఓ ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేస్తారు.

Update: 2024-12-28 09:30 GMT

బాలీవుడ్ హీరోల సినిమా ప్రచారం ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. రిలీజ్ కి ముందు సింపుల్ గా ఓ ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేస్తారు. అదీ ముంబైలో మాత్ర‌మే. ప్ర‌చారం కోసం పెద్ద‌గా తిర‌గ‌రు. ఈ మ‌ధ్య కాలంలో పాన్ ఇండియా రిలీజ్ లు అవ్వ‌డంతో? హైద‌రాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి సిటీల‌కు వెళ్తున్నారు. అక్క‌డ ప్ర‌చారం చేసినా? ఎలాంటి హ‌డావుడి లేకుండా సింపుల్ గా ఉంటుంది. లోక‌స్ ఛాన‌ల్స్ ప్రొగ్రామ్స్ లో పాల్గొని సినిమా ప్ర‌చారం చేసుకోవ‌డం త‌ప్ప‌! అభిమానుల‌తో ఇంట‌రాక్ష‌న్ అనేది ఉండ‌దు.

బాలీవుడ్ త‌రహాలోనే ప్ర‌చారం చేసుకుంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లు... టీజ‌ర్, ట్రైల‌ర్ ఈవెంట్లు అంటూ ప్ర‌త్యేకంగా చేయ‌రు. ఆర‌కంగా చూసుకుంటే హిందీ సినిమా ప్ర‌చారానికి పెద్ద‌గా ఖ‌ర్చు కూడా ఉండ‌దు. అయితే ఇటీవ‌లే `పుష్ప‌-2` బాలీవుడ్ లో భారీ విజ‌యం సాధించడంతో? బాలీవుడ్ హీరోలు కూడా జ‌నాల్లోకి వెళ్తారా? అన్న ప్ర‌చారం మొదలైంది. వాళ్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తారా? అని ఆనోటా ఈనోటా వినిపిస్తుంది.

ఈ నేప‌థ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం బ‌య‌ట ప‌డింది. బాలీవుడ్ హీరోలు జ‌నాల్లోకి వెళ్ల‌క‌పోవ‌డానికి ఓ ప్ర‌త్యేక మైన కార‌ణం వినిపిస్తుంది. త‌మ కార‌ణంగా ప‌బ్లిక్ ఇబ్బంది ప‌డ‌కూడ‌దు. సెల‌బ్రిటీ అంటే కేవలం తెరపై క‌నిపించి ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌డం వ‌ర‌కే త‌ప్ప జ‌నాల్లో తిరిగి వాళ్ల‌ను ఇబ్బంది పెట్ట‌డం కాదంటున్నారు.

తెర మీద క‌నిపించే న‌టుడు ఒక్క‌సారిగా సామాన్య జ‌నంలోకి వెళ్తే? వాళ్ల ఉత్సాహం..అత్యుత్సాహం ఎలా ఉంటుం దో? త‌మ‌కు తెలుసున‌ని.. ఆ కార‌ణంగా ఎన్నో స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని ముందే గెస్ చేసి రిలీజ్ కోసం ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లు లేకుండా నేరుగా త‌మ చిత్రాల్ని థియేట‌ర్లో రిలీజ్ చేస్తార‌ని ఓ విశ్లేష‌కుడు అభిప్రా య‌ప‌డ్డాడు. సినిమా న‌టుడు-సామాన్య ప్రేక్ష‌కుడి మాధ్య దూరం ద‌గ్గ‌రైతే? అది మ‌రింత స‌మ‌స్య‌గానే మారు తుంద‌న్నారు. ఆ మాత్రం వ్యత్యాసం లేక‌పోతే? తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న‌టి వంటి ప‌రిస్థితుల్లో త‌మ వ‌ద్ద జ‌ర‌గ‌డానికి అవ‌కాశం ఉటుంద‌న్నారు. సౌత్ లో ఉన్నంత అభిమానం నార్త్ లో ఉండ‌ద‌ని, ఇది ప‌రిశ్ర‌మ‌కు ఇది హెల్దీ వాతావ‌ర‌ణంగా పేర్కొన్నారు.

Tags:    

Similar News