పాండే బ్యూటీ భంగి*మ‌లు వావ్ అనిపించ‌లా!

నేటిత‌రంలో స్పీడున్న భామ‌గా అన‌న్య పాండే పేరు ఎంతో పాపుల‌రైంది. న‌ట‌వార‌సుల్లో అన‌న్య యూనిక్ బ్యూటీ అన్న‌ టాక్ వినిపిస్తోంది.

Update: 2024-08-21 05:29 GMT

నేటిత‌రంలో స్పీడున్న భామ‌గా అన‌న్య పాండే పేరు ఎంతో పాపుల‌రైంది. న‌ట‌వార‌సుల్లో అన‌న్య యూనిక్ బ్యూటీ అన్న‌ టాక్ వినిపిస్తోంది. వ‌రుస ఫోటోషూట్ల‌తో అమ్మ‌డు నిత్యం నెట్టింట వైర‌ల్ అవుతుంటుంది. అనుభ‌వం కొద్ది రాటు దేల్తారు అన్న‌ట్లు అన‌న్య కూడా ఫ్యాష‌న్ వ‌ర‌ల్డ్ లో అలాగే రాటుదేలుతోంది. ఫ్యాష‌న్ ఎంపిక‌ల్లో త‌న‌దైన మార్క్ వేస్తుంది. సెగ‌లు పుట్టించే ఫోటోల‌తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది.

తాజాగా అమ్మ‌డు మ‌రికొన్ని పోటోలతో నెటి జ‌నులు ముందుకొచ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలా స్కిన్ టైట్ దుస్తుల్లో స్టైలిష్ గా అలరిస్తుంది. వైట్ క‌ల‌ర్ బ‌నియ‌న్ పై మల్టీక‌ల‌ర్ డిజైన్ తో కూడిన టైట్ ఫిట్ ప్యాంట్ ధ‌రించింది. ఇత‌ర మ్యాక‌ప్ అలంక‌ర‌ణ అంతే హైలైట్ అవుతుంది. కాళ్ల‌కు హీల్స్ ధ‌రించింది. కెమారాకి అమ్మ‌డు వివిధ భంగిమ‌ల్లో ఫోజులిచ్చింది. కొన్ని స్టైలిష్ ఫోజులు అంతే ఆక‌ట్టుకుంటున్నాయి.


ఈ సంద‌ర్భంగా త‌న సినిమాని ప్ర‌మోట చేసుకుంటుంది. మీరు కాలీ మీ బె ట్రైల‌ర్ చూసారా? అంటూ నెటి జ‌నుల్ని అడిగింది. చూసిన వాళ్లంతా చూసిన‌ట్లు..చూడ‌ని వాళ్లంతా చూడ‌న‌ట్లు స‌మాధానం ఇచ్చారు. అయితే ఆ ట్రైల‌ర్ కంటే నెట్టింట మీరు చూపించే టీజ‌రే బాగుందంటూ? ఓ నెటి జ‌నుడు ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు, కామెంట్లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.


ఇక బాలీవుడ్ లో అమ్మ‌డి కెరీర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగులో లైగ‌ర్ ప్లాప్ అయిన అనంత‌రం అక్క‌డ ఏమాత్రం స‌మయం వృద్ధా చేయ‌కుండా బాలీవుడ్ కి వెళ్లిపోయింది. ల‌క్కీగా అవ‌కాశాలు బాగానే అందుకుంది. ఇప్పుడిప్పుడే స‌క్సెస్ బ్యూటీగా పికప్ అవుతుంది. ప్ర‌స్తుతం అమ్మ‌డి చేతిలో రెండు..మూడు సినిమాలున్నాయి.

Tags:    

Similar News