డేంజర్.. అగ్రహీరోల ఫ్యాన్ వార్ ఎటు దారి తీస్తోంది?
బాలీవుడ్ ని క్రైసిస్ నుంచి కాపాడేందుకు పరిశ్రమ ఇద్దరు అగ్రహీరోలు కలిసి ముందుకు వచ్చారు. కింగ్ ఖాన్ షారూఖ్.. భాయ్ సల్మాన్ కలయిక ఇటీవల సంచలనంగా మారింది.
ఆ ఇద్దరు హీరోలు కలిస్తే పెద్ద తెరపై గొప్ప మ్యాజిక్ సాధ్యమవుతోంది. పాన్ ఇండియాని కొల్లగొట్టాలంటే ఆ ఇద్దరూ కలిస్తేనే పనవుతోంది. కానీ ఇప్పుడు ఆ ఇద్దరి ఫ్యాన్స్ ఒకరితో ఒకరు ఘర్షణ పడుతున్నారు. హీరోల పోస్టర్లు చించేస్తూ లేదా ఒకరితో ఒకరు గొడవ పడుతూ థియేటర్ల వద్ద అల్లరి చేస్తున్నారు. తాజా పరిణామం చూస్తుంటే సన్నివేశం ముదిరిపాకాన పడుతోందని అర్థమవుతోంది. ఇలా అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిశ్రమకు ఇది మళ్లీ శాపంగా మారుతుందేమో అనే ఆందోళన నెలకొంది. ఫ్యాన్ వార్ ముదిరితే ఆ మేరకు అది బాక్సాఫీస్ కలెక్షన్లపై పడుతుందని విశ్లేషిస్తున్నారు. ఆ ఇద్దరు హీరోలు ఎవరనేది తెలియాలంటే అసలు వివరాల్లోకి వెళ్లాలి.
బాలీవుడ్ ని క్రైసిస్ నుంచి కాపాడేందుకు పరిశ్రమ ఇద్దరు అగ్రహీరోలు కలిసి ముందుకు వచ్చారు. కింగ్ ఖాన్ షారూఖ్.. భాయ్ సల్మాన్ కలయిక ఇటీవల సంచలనంగా మారింది. ఆ ఇద్దరు కలిస్తే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ అయినా సాధ్యమేనని నిరూపితమవుతోంది. అయితే ఇరువురి ఫ్యాన్స్ అగ్రెస్సివ్ నేచుర్ ఇప్పుడు కొత్త సమస్యలు తెస్తోంది. ఫ్యాన్ వార్ ముదిరిపాకాన పడడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. జవాన్ స్టార్ షారుఖ్ ఖాన్ ... సల్మాన్ ఖాన్ అభిమానులు ఎప్పుడూ సోషల్ మీడియాలో గొడవ పడుతుంటారు. వాస్తవానికి X వంటి ప్లాట్‌ఫారమ్‌లపై అభిమానుల యుద్ధాలు చాలా తీవ్రంగా ఉంటాయి, అవి చాలా రోజుల పాటు కొనసాగుతాయి.
ఇటీవల షారుఖ్ ఖాన్, విరాట్ కోహ్లి అభిమానుల మధ్య జరిగిన గొడవ చర్చగా మారింది. ఇప్పుడు ఖాన్ ల అభిమానుల మధ్య గొడవలు వేడెక్కిస్తున్నాయి. థానేలోని ఓ థియేటర్ వద్ద షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అభిమానులు గొడవకు దిగారు. నగర శివారులోని ఒక థియేటర్ వద్ద టైగర్ 3 పోస్టర్లను షారూఖ్ అభిమానులు చించివేసినట్లు తెలుస్తోంది. వాళ్లు జవాన్ బ్యాండేజ్ లుక్‌లో వచ్చారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి తీసుకెళ్లాల్సి వచ్చింది.
థానేలోని జవాన్ అభిమానులను ఫ్యాన్ వార్ కారణంగా బయటకు పంపినట్లు ఆరోపించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. థియేటర్ నుండి కొందరు అభిమానులను పోలీసులు బయటకు పంపిస్తూ కనిపించారు. కొందరు సల్మాన్ ఖాన్ మద్దతుదారులు జవాన్ పోస్టర్లను తొలగించారని లేదా వాటి పైన టైగర్ 3 పోస్టర్లను అతికించారని షారుఖ్ ఖాన్ అభిమానులు ఫిర్యాదు చేశారు. దీంతో గొడవ పెద్దదైంది. ఇరువర్గాల మధ్య బాహాబాహీకి ఇది తెర తీసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. దీనిపై పలువురు సోషల్ మీడియాలో కూడా స్పందించారు. ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్‌లో గొడవలు పెరగడం ఆందోళన కలిగిస్తోందని పలువురు అంటున్నారు. ఈ ఇద్దరు సూపర్‌స్టార్‌లకు క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. బాలీవుడ్ సినిమా ఎదుగుతున్న వేళ వారి మధ్య గొడవలు ముదరడం అంత శ్రేయస్కరం కాదని కూడా విశ్లేషిస్తున్నారు.
పాపులర్ గైటీ/గెలాక్సీ థియేటర్ వెలుపల కూడా ఫ్యాన్ వార్ బయటపడింది. తాజా పరిస్థితి చూస్తుంటే సల్మాన్ ఖాన్ - షారూఖ్ ఖాన్ కలసి తమ అభిమానులను నియంత్రించాల్సిన అవసరం ఉందని నొక్కి చెబుతున్నారు. పఠాన్ లో షారూఖ్ కోసం సల్మాన్ అతిథి పాత్రలో నటించగా, టైగర్ 3లో సల్మాన్ కోసం షారుఖ్ ఖాన్ ముఖ్యమైన అతిథి పాత్రలో నటించాడు. టైగర్ 3 దీపావళి కానుకగా విడుదల కానుంది. ఎటువంటి ఫ్యాన్ వార్ లేకపోతేనే టైగర్ 3 రికార్డులు సాధ్యమవుతాయనడంలో సందేహం లేదు. బాలీవుడ్ తిరిగి పూర్తిగా కోలుకోవాలంటే అగ్ర హీరోలు కలిసి పని చేయాలి. అది కూడా సౌత్ లో ప్రముఖ హీరోలు లేదా దర్శకులతో కలిసి పని చేయాలి. దీనివల్ల పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టడం సులువు అవుతుందని ఇటీవలి జవాన్ నిరూపించింది.