వెయ్యి కోట్లు.. నెక్స్ట్ ఆ హీరోకే సాధ్యం?
డార్లింగ్ ప్రభాస్ సలార్ మూవీ డిసెంబర్ ఆఖరులో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది
డార్లింగ్ ప్రభాస్ సలార్ మూవీ డిసెంబర్ ఆఖరులో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రస్తుతం డీసెంట్ కలెక్షన్స్ తో నడుస్తోంది. అయితే సలార్ మూవీ మీద ఉన్న బజ్ తో కచ్చితంగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని సునాయాసంగా అందుకుంటుందని అందరూ అంచనా వేశారు. అయితే ఊహించని విధంగా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి.
వెయ్యి కోట్లకి చేరుకోవడం అస్సలు సాధ్యం కాదని ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే కనిపిస్తోంది. దీనికి కనిపించే రీజన్స్ చాలానే ఉన్నా మరో ఎండ్ లో సౌత్ సినిమా మార్కెట్ వేల్యూ ఎంత ఉంది అనేది కూడా ఒక స్పష్టత వస్తుంది. ముఖ్యంగా తెలుగు సినిమాకి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎంత స్టామినా ఉందనేది సలార్ తో ఒక క్లారిటీ వచ్చిందని చెప్పొచ్చు.
ఈ మధ్యకాలంలో ఓటీటీ మార్కెట్ పెరిగిన తర్వాత అన్ని భాషల నుంచి పాన్ ఇండియా ఇమేజ్ తోనే సినిమాలు వస్తున్నాయి. కొన్ని మూవీస్ నాలుగు, ఐదు భాషలలో నేరుగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. మరికొన్ని ఓటీటీలోకి వెళ్ళాక ఇతర భాషలలో డబ్ అవుతున్నాయి. ఈ ఓటీటీ మార్కెట్ థీయాట్రికల్ కలెక్షన్స్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. సినిమా అద్భుతంగా ఉందనే టాక్ వస్తేనే థియేటర్స్ వారం, పది రోజుల పాటు నిండుతున్నాయి. లేదంటే వీకెండ్ అయ్యేసరికి ఖాళీ అయిపోతున్నాయి.
ఓటీటీ పక్కన పెడితే సౌత్ ఇండియా నుంచి దర్శకుడు రాజమౌళికి మాత్రమే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్ల కలెక్షన్స్ అందుకునే సత్తా ఉందని ప్రూవ్ అయ్యింది. ప్రభాస్ కి ఆ స్టామినా ఉందని అందరూ అంచనా వేశారు. అయితే బాహుబలి 2 తర్వాత ఏ సినిమా 500 కోట్లు కూడా దాటలేదు. సలార్ మూవీ బాగుందనే టాక్ వచ్చిన కూడా వెయ్యి కోట్లకి రీచ్ కావడానికి ఆపసోపాలు పడుతుంది.
ఈ లెక్కన చూసుకుంటే ఈ ఏడాదిలో ఒక్క పుష్ప ది రూల్ మూవీకి మాత్రమే బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్ల టచ్ చేసే సత్తా ఉంటుందని, మిగిలిన సినిమాలేవీ ఆ దరిదాపుల్లోకి రీచ్ కాకపోవచ్చనే మాట వినిపిస్తోంది. అయితే ఈ ఏడాదిలోనే ప్రభాస్ కల్కి కూడా రిలీజ్ అవుతోంది. ఆ సినిమాని పాన్ వరల్డ్ రేంజ్ లో ఏకంగా 38 భాషలలో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా కూడా వెయ్యి కోట్లు కలెక్షన్స్ బ్రేక్ చేసే అవకాశం ఉంది.