తల రేసింగ్ చూసి స్టన్ అవ్వాల్సిందే!
తాజాగా ఆ శిక్షణ కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
తల అజిత్ కి బైక్..కార్ రేసింగ్ ఓ హాబీ. అందులో అతడు మాస్టర్. చేతిలో బైకుంటే చాలు ప్రపంచ యాత్రికుడు అయిపోతాడు. కార్ రేస్ లోనూ ఫార్ములా రేసర్. ఎఫ్-2, ఎఫ్ -3 రేసులోనూ పాల్గొన్నాడు. తాజాగా తల మరో రేసింగ్ కి సన్నధం అవుతున్నాడు. దుబాయ్‌లో జరగనున్న జీటీ3 కప్ కార్ రేస్ కోసం అజిత్ స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. తాజాగా ఆ శిక్షణ కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
అజిత్ కొంత కాలంగా తన పేరుతోనే రేసింగ్ టీమ్ నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ జట్టుకు అధికారిక డ్రైవర్‌గా ఫాబియన్ డఫీక్స్విల్ను ప్రకటించారు. ఇటీవల, నెదర్లాండ్స్‌కు చెందిన రేస్ ప్లేయర్ల కోసం దుస్తులను తయారు చేసే కంపెనీ అధికారులతో అజిత్ సంప్రదింపులు జరుపుతున్నాడు. ఈ నేపథ్యంలో జీటీ-3 కప్ పోటీలో పాల్గొ నేందుకు అజిత్ శిక్షణ తీసుకుంటున్న వీడియో బయటకు వచ్చింది.
అందులో అజిత్ డ్రైవింగ్ చూసి నెటిజనులు సహా అభిమానులు షాక్ అవుతున్నారు. ఇతడు ఇంత ట్యాలెంటెడ్ నా? అంటూ సర్ ప్రైజ్ అవుతున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే ఇలా రేసర్ గా కొనసాగడం అన్నది అజిత్ కి మాత్రమే చెల్లింది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నటులున్నారు. కానీ వాళ్లెవ్వరికీ సాధ్యం కానిది అది సాధించి చూపిస్తున్నాడు. ఈ విషయంలో అజిత్ ని గ్రేట్ అని మెచ్చుకోవాల్సిందే. రేసింగ్ అన్నది ప్రాణాలతో చలగాటం లాంటింది.
ఎంతో ధైర్య సాహసం ఉంటే తప్ప సాధ్యం కాదు. కానీ తల అజిత్ దీన్ని ఎంతో ఈజీగా చేయగల్గుతున్నాడు. ప్రస్తుతం అజిత్ హీరోగా రెండు సినిమాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. విడా ముయార్చీ, గుడ్ బ్యాడ్ అగ్లీలో నటిస్తున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి.