'బ్రో'​.. ఓ గుడ్ న్యూస్, మరో బ్యాడ్ న్యూస్!

ఇక ఈ విషయం తెలుసుకుంటున్న పవన్, మెగా అభిమానుల ను తెగ సంబరపడిపోతున్నారు.

Update: 2023-07-19 09:55 GMT

పవర్​ స్టార్​ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్​ 'బ్రో' మూవీ పై అభిమానుల్లో భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ మెగా మామా అల్లుడు తొలిసారి కలిసి నటిస్తున్న సినిమా కావడం వల్ల ఫ్యాన్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం జులై 28న గ్రాండ్​గా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీటీమ్​ స్లోగా ప్రమోషన్స్​ షురూ చేసింది.

ఇందులో భాగంగా చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. టికెట్ల ధర కొంచెం కూడా పెంచడం లేదని క్లారిటీ చేశారు. సినిమా ను మీడియం బడ్జెట్ ​లోనే తెరకెక్కించినట్లు తెలిపారు. అందుకే ఈ మూవీ టికెట్ల ధర ను పెంచకూడదని తాము నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. వాస్తవానికి గత కొద్దికాలంగా ఏ స్టార్​ హీరో భారీ బడ్జెట్ సినిమా రిలీజైనా టికెట్ల ప్రైస్​ భారీగా పెంచేస్తున్నారు.

మొదటి వారం లేదా పది రోజుల పాటు ఈ భారీ ధరలు అమలులోనే ఉంటున్నాయి. కానీ 'బ్రో' మూవీ టీమ్​ మాత్రం అలా చేయకూడదని ఫిక్స్​ అయిందట. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న పవన్, మెగా అభిమానుల ను తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఇదే సమయం లో మరో విషయం కూడా చెప్పారు టీజీ విశ్వప్రసాద్. ఈ సినిమా కు ఎలాంటి అదనపు షోలు కూడా ఉండవని స్పష్టత ఇచ్చారు. ఓ విధంగా ఎర్లీగా సినిమా చూడాలి అనుకునే హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూసే.

ఇకపోతే ఈ సినిమా ట్రైలర్​ జులై 21న రిలీజ్ కానుంది. అలాగే 25న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రం లో పవన్ సరసన కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ నటించారు. మ్యూజిక్​ సెన్సేషన్​ తమన్ సంగీతం అందించారు. తమిళం లో సూపర్ హిట్​ గా నిలిచిన వినోదయ సీతం చిత్రానికి రీమేక్ ​గా ఈ బ్రో మూవీ రూపొందింది. తమిళం లో దర్శకత్వం వహించిన సముద్రఖనినే తెలుగు లోనూ డైరెక్ట్ చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ఒరిజినల్​ స్టోరీకి కొన్ని మార్పులు చేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

అనుకోకుండా ఓ ప్రమాదం లో క‌న్నుమూసిన ఓ వ్య‌క్తికి దేవుడు కనిపించి.. బతకడానికి రెండో అవకాశం ఇస్తే.. ఏం జ‌రిగింద‌నే క‌థాంశంతో ఈ బ్రో చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో టైమ్ అనే మోడ్రన్ దేవుడి పాత్రలో ప‌వ‌న్ క‌ల్యాణ్ నటించగా.. మార్కాండేయులు అలియాస్ మార్క్ అనే పాత్రలో సాయి ధ‌ర‌మ్‌ తేజ్ కనిపించనున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్​ ను అందుకుంటుందో.

Tags:    

Similar News