స‌క్సెస్ బాష్ లో అంద‌మైన భామ‌ల‌ అరుపులు..మెరుపులు!

పోటీగా మ‌రో రెండు సినిమాలు రిలీజ్ అయినా స్త్రీ దాడి ముందు ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోయాయి.

Update: 2024-08-20 20:30 GMT

ఇటీవ‌ల విడుద‌లైన `స్త్రీ-2` భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. హారర్ కామెడీ థ్రిల్ల‌ర్ కి ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు. పోటీగా మ‌రో రెండు సినిమాలు రిలీజ్ అయినా స్త్రీ దాడి ముందు ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోయాయి. సినిమా ఐదు రోజుల్లోనే 228 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. ఇప్ప‌టికీ బాక్సాఫీస్ వ‌ద్ద అదే దూకుడు కొన‌సాగిస్తుంది.

పోటీగా సినిమాలు లేక‌పోవ‌డం వ‌సూళ్ల‌కు క‌లిసొచ్చింది. ఈ మ‌ధ్య బాలీవుడ్ లో హిట్ సినిమా ఒక్క‌టీ లేదు అనుకుంటోన్న స‌మ‌యంలో `స్త్రీ-2` ఆ లోటును భ‌ర్తి చేసింది. దీంతో చిత్ర యూనిట్ స‌క్సెస్ భాష్ లోకి జారుకుంది. టీమ్ అంతా గ్రాండ్ గా పార్టీలో చిల్ అవుతున్నారు. తమన్నా భాటియా, శ్రద్ధా కపూర్, కృతి సనన్ సహా యూనిట్ అంతా గ్రాండ్ గా స‌క్సెస్ పార్టీ సెల‌బ్రేట్ చేసుకున్నారు.

దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. పార్టీలో, తమన్నా, శ్రద్ధ క‌పూర్, కృతి డ్యాన్స్ ల‌తో అద‌ర‌గొడుతున్నారు. పాపులర్ ట్రాక్ "ఆజ్ కీ రాత్ష పాట‌కు డాన్సు చేసారు. మిల్కీబ్యూటీ డ‌బుల్ ఎన‌ర్జీతో త‌న‌దైన మార్క్ స్టెపులేసింది. అదే స‌మ‌యంలో స‌హ‌న‌టుల మ‌ధ్య ఆప్యాయ‌త హైలైట్ అయింది.

నటీమణుల మధ్య స్నేహం స్పష్టంగా కనిపించింది, శ్రద్ధా సరదాగా తమన్నాకు నమస్కరించడం ..ఇరువురు ఆప్యాయంగా కౌగిలించుకోవ‌డం. మ‌ధ్య‌లో ప్రియుడు విజ‌య్ వ‌ర్మ త‌మ‌న్నా ఉత్సాహాన్ని మ‌రింత రెట్టింపు చేసాడు. ఈ వేడుకలో `వో స్త్రీ హై, వో కుచ్ భీ కర్ శక్తి హై` అంటూ మ‌హిళామ‌ణుల్లో మ‌రింత ఉత్సాహం నింపారు. దర్శకుడు అమర్ కౌశిక్ - అభిషేక్ బెనర్జీతో సహా ఇతర తారాగణం పార్టీలో భాగ‌మ‌య్యారు.

Tags:    

Similar News