సాయి పల్లవి సీక్రెట్ బయటపెట్టిన చైతూ

శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో ఓ ఫిషర్ మెన్ 'లవ్ స్టోరీ'తో ఈ సినిమా రెడీ అవుతోంది.

Update: 2024-12-08 04:37 GMT

ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవి జోడీగా 'తండేల్' మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో వీరిద్దరూ కలిసి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' మూవీలో నటించారు. ఈ సినిమా కమర్షియల్ హిట్ అయ్యింది. ఇప్పుడు చందూ మొండేటి దర్శకత్వంలో 'తండేల్' సినిమా తెరకెక్కుతోంది. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో ఓ ఫిషర్ మెన్ 'లవ్ స్టోరీ'తో ఈ సినిమా రెడీ అవుతోంది.

రీసెంట్ గా సాయి పల్లవి ఖాతాలో అమరన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ పడింది. నెస్స్ట్ రాబోయే 'తండేల్' కూడా సూపర్ హిట్ కావడం పక్కా అని అనుకుంటున్నారు. మరో వైపు హిందీలో అమీర్ ఖాన్ తనయుడితో సాయి పల్లవి చేస్తోన్న మూవీ ఆల్ మోస్ట్ ఫైనల్ దశకి వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే 'రామాయణం'లో సీతాదేవిగా కనిపించబోతోంది. ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనే సంగతి అందరికి తెలిసిందే.

సాయి పల్లవి ఏ సినిమా చేసిన ఆ మూవీ కథతో పాటు అందులో తన పాత్ర గురించి దర్శకులని పూర్తిగా అడిగి తెలుసుకుంటుందనే టాక్ ఉంది. కథ మొత్తం నచ్చి అందులో తన పాత్ర కూడా బాగుంటేనే మూవీ ఒప్పుకుంటుంది. అలాగే షూటింగ్ జరిగిన సమయంలో కూడా మోనిటర్ చూసుకొని పెర్ఫార్మెన్స్ సరిగా రాకపోతే మరల రీటేక్ చేస్తుందంట. ఈ విషయం తాజాగా ది రానా దగ్గుబాటి షోలో నాగ చైతన్య రివీల్ చేశాడు.

అమెజాన్ ప్రైమ్ లో రీసెంట్ గా ది రానా దగ్గుబాటి షో ప్రారంభం అయ్యింది. ఇది కూడా సెలబ్రెటీ టాక్ షోనే అయిన కూడా రానా తనదైన శైలిలో యూత్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ తో ఇది చేస్తున్నాడు. అందుకే మంచి ఆదరణ సొంతం చేసుకుంటుంది. ఈ షోలో థర్డ్ ఎపిసోడ్ చైతన్యతో జరిగింది. ఇందులో ఆసక్తికర అంశాలు మాట్లాడుకుంటున్నారు. సాయి పల్లవికి రానా ఫోన్ చేసి కాసేపు సరదాగా ఆడుకున్నారు.

ఇండస్ట్రీలో సాయిపల్లవితో యాక్ట్ చేసేటపుడు ఏ సీన్ అయినా దగ్గరుండి చెక్ చేసుకుని అవసరమైతే మళ్ళీ రీ షూట్ అడుగుతుందనే టాక్ ఉంది. దాని గురించి రానా అడిగితే అబ్బే అదేం లేదని, వాళ్లే తనను పిలుస్తారు కాబట్టి చూస్తాను. నేనేం ఎడిటింగ్ లో తలదూర్చనని క్లారిటీ ఇచ్చింది. సాయి పల్లవి రానాతో గతంలో విరాట పర్వం చేసింది. చైతుతో లవ్ స్టోరీ అయ్యాక ఇప్పుడు తండేల్ చేస్తోంది.

సాయిపల్లవి ఇద్దరి హీరోల్లో చికాకు పెట్టించేది చైతూనే అని చెప్పింది. ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్ గా ఉండటం తనకి కోపం తెప్పిస్తుందని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ట్విస్టు ఏంటంటే దానికి సమాధానం నాగచైతన్యే చెప్పాడు. తన పని కూడా ఆమె చేస్తూ టేక్ అయ్యాక మానిటర్ దగ్గరకు పరిగెత్తుకొస్తూ ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం ఏముందని, అంతా సాయిపల్లవినే చూసుకుంటుందని చెప్పాడు. ఇలా రానా, చైతన్య కలిసి సాయి పల్లవి సీక్రెట్ ని ఈ ఎపిసోడ్ లో బయట పెట్టేసారు. ఇక ఈ ఎపిసోడ్ లో భాగంగా నాగ చైతన్యకి ఇష్టమైన కార్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నారు.

Tags:    

Similar News