వెబ్ సీరీస్ తో ఆ టెన్షన్ ఉండదంటున్న యువ సామ్రాట్..!

ఈ స్పెషల్ చిట్ చాట్ లో చైతన్య చాలా విషయాలను వెల్లడించారు.

Update: 2024-12-08 07:30 GMT

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య లేటెస్ట్ గా రానా దగ్గుబాటి షోలో పాల్గొన్నారు. ఈ స్పెషల్ చిట్ చాట్ లో చైతన్య చాలా విషయాలను వెల్లడించారు. అసలైన విజయం మన సినిమా సాధించిన కలెక్షన్స్ లోనో అది హిట్ అవ్వడంలోనో కాదు మనం తెలివిగా ఎంచుకున్న కథ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడంలోనే ఉంటుందని అన్నారు నాగ చైతన్య. ఇక తన జీవితంలో ఫ్యామిలీనే మొదటి ప్రాధాన్యత అని అన్నారు.


ధూత వెబ్ సీరీస్ సక్సెస్ తన ఆలోచన మార్చిందని అన్నారు నాగ చైతన్య. సినిమా అయితే హిట్, ఫెయిల్, కలెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ వెబ్ సీరీస్ కు అలాంటి టెన్షన్స్ ఏమి ఉండవు. సీరీస్ చేయడంపై ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుందని అన్నారు నాగ చైతన్య. ఆ టైం లో రానా కూడా తాను కూడా రానా నాయుడు వెబ్ సీరీస్ చేసినప్పుడు అందరు నన్ను తిట్టుకున్నారని అన్నారు రానా. సినిమాలు, వెబ్ సీరీస్ రెండు చేస్తానని అన్నారు నాగ చైతన్య. 6 నెలలు వెబ్ సీరీస్ కి కేటాయిస్తానని అన్నారు.

రీసెంట్ గానే శోభిత ధూళిపాల ని పెళ్లాడిన నాగ చైతన్య. పెళ్లి జోష్ లో కనిపిస్తున్నారు. ఇదే ఇంటర్వ్యూలో రానా, నాగ చైతన్య కలిసి సాయి పల్లవికి కాల్ చేసి ఇద్దరు ఆమెను సరదాగా టీజ్ చేస్తూ ఆడుకున్నారు. సాయి పల్లవి ఏదైనా సీన్ సరిగా రాకపోతే మోనిటర్ దగ్గరకు వెళ్లి చూస్తుందని.. ఎడిటింగ్ టేబుల్ లో ఎడిట్ కూడా చేస్తుందని అన్నారు. మీ ఇద్దరు కలిసి నన్ను టీజ్ చేస్తున్నారు కదా అని సాయి పల్లవి అన్నది.

నాగ చైతన్యతో ప్రస్తుతం సాయి పల్లవి తండేల్ సినిమా చేస్తుంది. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాను చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నారు. నాగ చైతన్య కెరీర్ లో మొదటి 100 కోట్ల సినిమా ఇది అవుతుందని అంటున్నారు. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే బుజ్జి తల్లి సాంగ్ రిలీజై సూపర్ హిట్ అయ్యింది. యదార్ధ ప్రేమకథగా వస్తున్న తండేల్ పై అక్కినేని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. రానాతో నాగ చైతన్య చేసిన స్పెషల్ చిట్ చాట్ లో సుమంత్ ఇంకా రానాకు ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాల్గొన్నారు.

Tags:    

Similar News