'స‌ప్త‌ సాగ‌రాలు దాటి' హీరోయిన్.. బికినీలో బ్లాస్టింగ్..

తాజాగా స్విమ్ సూట్ లో దిగిన పిక్స్ షేర్ చేసి నెట్టింట హీటు పుట్టించింది ఈ అమ్మడు. తన స్కిన్ షోతో సెగలు రేపింది. కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ కూడా చేసింది.

Update: 2024-05-30 06:44 GMT

సప్త సాగరాలు దాటి సైడ్ బీ మూవీ చూశారా? అందులో నటించిన కన్నడ బ్యూటీ చైత్ర ఆచార్ గుర్తుందా? చూడడానికి పక్కంటి అమ్మాయిలా కనిపిస్తూ తెలుగులో మంచి ఫేమ్ సంపాదించుకుంది. తన అందం అభినయంతో సినీ ప్రియులను అలరించింది. అయితే గర్ల్ నెక్స్ట్ డోర్ అన్న‌ట్టుగా కనిపించే ఈ భామ.. ప్రైవేట్ లైఫ్‌ లో మాత్రం అందుకు చాలా భిన్నంగా ఉంటోంది. ఓ రేంజ్ లో గ్లామర్ షో చేస్తుంటోంది.

 

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారు మతులు పోగుడుతుంటుంది. అంత‌లా అమ్మ‌డి అందాల విందు ప్ర‌ద‌ర్శ‌న ఉంటుంది మరి. తాజాగా స్విమ్ సూట్ లో దిగిన పిక్స్ షేర్ చేసి నెట్టింట హీటు పుట్టించింది ఈ అమ్మడు. తన స్కిన్ షోతో సెగలు రేపింది. కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ కూడా చేసింది.

 

బ్లాక్ అండ్ వైట్ స్విమ్ సూట్ లో చైత్ర అందాలకు అల్లాడిపోతున్నామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. స్విమ్ చేసి బయటికి వచ్చి బ్యూటీ ఇచ్చిన పోజు వేరే లెవెల్లో ఉందని, అందమంతా ఆమె లోనే ఉందని కుర్రాళ్లు చెబుతున్నారు. స్కిన్ షో మైండ్ బ్లాక్ చేసేలా ఉందని అంటున్నారు. ఓ రేంజ్ లో లైకులు కొడుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. షేర్లు చేస్తూ కామెంట్ల బాక్స్ నింపేస్తున్నారు.

 

ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే.. 2019లో మ‌హిరా చిత్రంతో సినిమా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది. తక్కువ టైమ్ లోనే మల్టీ టాలెంట్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సింగర్ గా సెటిల్ అవ్వాలనుకున్న ఈ బ్యూటీ.. హీరోయిన్ గా మారింది. ఇప్పటి వరకు 10 కన్నా తక్కువ సినిమాలే చేసినా.. మంచి ఫ్యాన్ బేస్ దక్కించుకుంది. ప్లే బ్యాక్ సింగర్ గా 10 పాటలు పాడి అలరించింది.

2023లో రెండు చిత్రాలతో వచ్చింది చైత్ర. ర‌క్షిత్ శెట్టి స‌ప్త‌ సాగ‌రాలు దాటి సైడ్ బీ, రాజ్ బీ శెట్టి టోబీ సినిమాల‌తో సందడి చేసింది. ఒక్క‌సారిగా వెలుగులోకి రావడమే కాకుండా.. ఆ చిత్రాల‌తో విల‌క్ష‌ణ న‌టిగా పేరు సంపాదించుకుంది. తాజాగా బ్లింక్ అనే కన్నడ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్ర‌స్తుతం మ‌రో నాలుగైదు చిత్రాల్లో న‌టిస్తోంది. మరి ఈ బ్యూటీ కొత్త సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.

Tags:    

Similar News