జవాన్.. షారుక్ రొమాన్స్ కూడా గట్టిగానే..

ఈ సినిమాలో ఇద్దరి మధ్యలో వచ్చే రొమాంటిక్ సీన్స్ మళ్లీ మళ్లీ మాట్లాడుకునే విధంగా ఉంటాయట.

Update: 2023-08-14 12:19 GMT

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ అట్లీ దర్శకత్వంలో నటించిన జవాన్ సినిమా మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా భారీ స్థాయిలోనే విడుదల చేయబోతున్నారు. దర్శకుడు అట్లీకి సౌత్ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ ఉండడంతో అన్ని భాషలకు సంబంధించిన అప్డేట్స్ గట్టిగానే వైరల్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఇక ప్రతి అప్డేట్ కూడా ప్రతి లాంగ్వేజ్ లో కనెక్ట్ అయ్యే విధంగా ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఓ సాంగ్ విడుదలయ్యింది. తమిళ యువ కెరటం అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే మొదటి సాంగ్ కు మాత్రం అంతగా అనుకున్నంత స్థాయిలో అయితే పాజిటివ్ హైప్ అయితే ఏమి రాలేదు.

ఇక ఇప్పుడు సినిమాకు సంబంధించిన మరొక రొమాంటిక్ సాంగ్ అయితే విడుదల చేశారు. షారుక్ ఖాన్ అనగానే ముందుగా అతనిలోని రొమాంటిక్ యాంగిల్ సినిమాలో హైలెట్ అవుతూ ఉంటుంది. ప్రతి సినిమాలో కూడా ఒక లవ్ సాంగ్ తో షారుక్ ఖాన్ సినిమాకు ఊహించిన విధంగా హైప్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటాడు.

ఇక ఇప్పుడు జవాన్ సినిమాలో కూడా ఆ యాంగిల్ తో మెప్పించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 'చలేయా' అనే పాటలో నయనతారతో షారుక్ ఖాన్ మంచి కెమిస్ట్రీ ని హైలెట్ చేశాడు. డాన్స్ మూమెంట్స్ తో పాటు నయనతారతో అతను కనిపించిన విధానం ఫ్యాన్స్ కు మంచి కిక్ అయితే ఇస్తుంది. ఈ సినిమాలో ఇద్దరి మధ్యలో వచ్చే రొమాంటిక్ సీన్స్ మళ్లీ మళ్లీ మాట్లాడుకునే విధంగా ఉంటాయట.

దర్శకుడు అట్లీ తన ప్రతి సినిమాలో కూడా హీరోయిన్స్ ను చాలా అందంగా ప్రజెంట్ చేస్తూ ఉంటాడు. ఒకవైపు నేచురల్ గా ఉంటూనే మరొకవైపు హీరోతో గ్లామర్ ను హైలెట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి నయనతార తో షారుక్ ఖాన్ రొమాంటిక్ సీన్స్ అంటే గట్టిగానే ఉంటాయని ఈ పాటతోనే అర్థమవుతుంది. ఈ పాట మొదట వినగానే అంతగా కనెక్ట్ అవ్వడం లేదు. మరి రాబోయే రోజుల్లో మెల్లగా అనిరుద్ జనాలకు ఈ పాటలను ఎక్కిస్తాడో లేదో చూడాలి.

Full View
Tags:    

Similar News