'తండేల్' అంటే అర్థం చెప్పిన డైరెక్ట‌ర్ చందు

అయితే అన్ని సందేహాల‌కు ఇప్పుడు స‌మాధానం ల‌భించింది. దర్శకుడు చందూ మొండేటి తాజా ఇంటర్వ్యూలో టైటిల్ వెనుక ఉన్న అర్థాన్ని వెల్లడించారు.

Update: 2023-11-26 08:00 GMT

నాగ చైతన్య క‌థానాయ‌కుడిగా చందు మొండేటి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం టైటిల్‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. 'తండేల్' అనేది టైటిల్. ఈ ప్రతిష్టాత్మక తీర‌ప్రాంత డ్రామాలో నాగ‌చైత‌న్య బెస్త‌వాని(మ‌త్స్య‌కార యువ‌కుడు)గా క‌నిపిస్తాడు. గుజరాత్ తీరంలో సముద్ర జలాల్లో పెనవివాదంలో చిక్కుకున్న శ్రీకాకుళానికి చెందిన జాలరి పాత్రలో చై నటిస్తున్నారు. ఇందులో ప్రేమ‌క‌థ యూనిక్ గా ఉంటుంద‌ని చెబుతున్నారు. సినిమా టైటిల్‌ను రెండు రోజుల క్రితం చై పుట్టినరోజున ప్రకటించగా దీనిపై ర‌క‌ర‌కాల సందేహాలు నెటిజ‌నుల్లో వ్య‌క్త‌మ‌య్యాయి.


అయితే అన్ని సందేహాల‌కు ఇప్పుడు స‌మాధానం ల‌భించింది. దర్శకుడు చందూ మొండేటి తాజా ఇంటర్వ్యూలో టైటిల్ వెనుక ఉన్న అర్థాన్ని వెల్లడించారు. తండేల్ అంటే గుజరాతీలో 'బోట్ ఆపరేటర్' అని అర్థం అనీ, గతంలో గుజరాత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని కుగ్రామాల్లో తండేల్ అనే పదాన్ని విరివిగా వాడేవారని తెలిపారు. గత ఆరు నెలలుగా చై తన పాత్ర కోసం చాలా కష్టపడుతున్నాడని చందూ వెల్లడించాడు. శ్రీకాకుళంలోని మత్స్యలేశం గ్రామాన్ని సందర్శించిన చై స్థానిక మత్స్యకారులతో ముచ్చ‌టించి, అక్క‌డి వారి బాడీ లాంగ్వేజ్‌ని పరిశీలించారు. శ్రీకాకుళం మాండలికం మత్స్యకారుల బాడీ లాంగ్వేజ్‌పై పట్టు సాధించడానికి చై కొన్ని వర్క్‌షాప్‌లలో కూడా పాల్గొన్నాడు. తన జుట్టు గడ్డం పెంచడమే కాకుండా, చై తన శరీరాన్ని పెంచుకోవడానికి జిమ్‌కు కూడా వెళుతున్నాడు' అని చందు వెల్లడించారు.

చైత‌న్య‌ - సాయి పల్లవి జంట‌ ఇంత‌కుముందు తెలంగాణ నేప‌థ్యంలోని 'ల‌వ్ స్టోరి'లో న‌టించారు. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. ఇప్పుడు మ‌రోసారి ఈ జంట రిపీట‌వుతోంది. చై-సాయిప‌ల్ల‌వి మధ్య ఎమోషనల్ లవ్ స్టోరీని తండేల్ లో చూపించ‌నున్నామ‌ని చందూ మొండేటి వెల్లడించారు. GA2 మూవీస్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Tags:    

Similar News