షాకింగ్ సీక్రెట్స్‌తో చరణ్ 'అన్‌స్టాపబుల్' పార్ట్ 2
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 కి మంచి స్పందన దక్కింది.
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 కి మంచి స్పందన దక్కింది. ఇంతకు ముందు స్ట్రీమింగ్ అయిన మూడు సీజన్‌లతో పోల్చితే ఈసారి మరింత ఉత్సాహంగా బాలకృష్ణ కనిపించారు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రతి రోజు బాలకృష్ణ అన్‌స్టాపబుల్ ముచ్చట్లు కంటిన్యూ అవుతున్నాయి. గత వారం రామ్ చరణ్ గెస్ట్‌గా ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యింది. ఈ వారం అన్‌స్టాపబుల్ ఎవరితో అంటూ ఎదురు చూస్తున్న సమయంలో రామ్ చరణ్ ఎపిసోడ్ పార్ట్ 2 ను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఆహా టీం నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది.
రామ్ చరణ్ అన్‌స్టాపబుల్ పార్ట్ 1 లో పలు ఆసక్తికర విషయాలను చర్చించారు. రామ్ చరణ్ తల్లి గారు, నానమ్మ మాట్లాడిన విషయం తెల్సిందే. క్లింకార విషయాలను చరణ్ పంచుకున్నాడు. గేమ్ ఛేంజర్ సినిమా గురించిన విశేషాలను షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ పార్ట్ 2లో స్నేహితులు శర్వానంద్‌తో పలు ఆసక్తికర విషయాలను పంచుకోబోతున్నాడు. అంతే కాకుండా అకీరా నందన్ సినిమా రంగ ఎంట్రీకి సంబంధించిన సీక్రెట్‌తో పాటు ప్రభాస్ పెళ్లికి సంబంధించిన సీక్రెట్‌ను అన్‌స్టాపబుల్ పార్ట్ 2లో చెప్పనున్నట్లు టీజర్‌ను చూస్తే అర్థం అవుతుంది. జనవరి 17వ తారీకున ఈ ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.
బాలకృష్ణ సరదాగా హోస్టింగ్ చేస్తూ నిర్వహిస్తున్న అన్‌స్టాపబుల్‌లో రామ్ చరణ్ పాల్గొనడంతో ఇప్పటికే ఆ ఎపిసోడ్‌కి మంచి స్పందన దక్కింది. చిరంజీవి గురించి పలు ఆసక్తికర విషయాలను అడిగి తెలుసుకోవడంతో పాటు ఎన్నో విషయాలను బాలకృష్ణ, చరణ్ పంచుకున్నారు. అందుకే ఆ ఎపిసోడ్‌కి మంచి స్పందన వచ్చింది. ఆ ఎపిసోడ్‌కి ఏమాత్రం తగ్గకుండా తాజా ఎపిసోడ్ ఉండబోతుందని టీజర్‌ను చూస్తే అర్థం అవుతుంది. ఈ ఎపిసోడ్‌లో ప్రభాస్‌తో ఫోన్ ఇన్ ఉంటుందని, అంతే కాకుండా రామ్ చరణ్ సిస్టర్స్ ఇద్దరూ ఒక సీక్రెట్ లెటర్‌ని పంపించారు. ఆ లెటర్‌లో ఏం ఉంది అనేది ఎపిసోడ్‌లో రివీల్ కాబోతుంది. మొత్తానికి పార్ట్ 2 పైనా చాలా అంచనాలు కలిగించే విధంగా టీజర్ ఉంది.
రామ్ చరణ్ తాజాగా గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఆ సినిమాలోని అప్పలరాజు పాత్రకు మంచి స్పందన దక్కింది. మిశ్రమ స్పందన వచ్చిన భారీ వసూళ్లు నమోదు చేస్తుంది అంటూ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న కలెక్షన్స్ పోస్టర్స్ విడుదల అవుతున్నాయి. లాంగ్ రన్‌లో ఈ సినిమా ఎంత వసూళ్లు సాధిస్తుంది అనేది చూడాలి. ఇక ఇప్పుడు అందరి దృష్టి బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా మీద ఉంది. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిస్తున్న సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెల్సిందు.