పవన్ కంట్రోల్ లో చరణ్.. కిక్కిస్తున్న వీడియో
అందుకు రాజమండ్రి వేదికవ్వగా.. అందుకు సంబంధించిన పిక్స్, వీడియోస్ ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి
పవన్ కళ్యాణ్- రామ్ చరణ్.. బాబాయ్- అబ్బాయ్ మూమెంట్ ను రీసెంట్ గా చూసి మెగా అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్న విషయం తెలిసిందే. అందుకు రాజమండ్రి వేదికవ్వగా.. అందుకు సంబంధించిన పిక్స్, వీడియోస్ ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఎక్కడా చూసినా అవే కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా చరణ్ ను పవన్ కంట్రోల్ చేస్తున్న వీడియో అయితే చెప్పనక్కర్లేదు. అంతలా వైరల్ గా మారింది. మెగా ఫ్యాన్స్ అందరి సోషల్ మీడియా వాల్స్ లో కచ్చితంగా కనిపిస్తుంది. అదే అసలైన బాబాయ్- అబ్బాయ్ మూమెంట్ అని కొనియాడుతున్నారు. బాబాయ్ దగ్గర ఉంటే అబ్బాయ్ ఎప్పుడూ సేఫే అని కామెంట్లు పెడుతున్నారు. అసలేం జరిగిందంటే..
వేడుకలో భాగంగా యాంకర్.. చరణ్, పవన్ ను వేదికపైకి ఆహ్వానిస్తారు. ఆ సమయంలో వెళ్లేందుకు చరణ్ రెండు సార్లు లేచి నిలబడేందుకు ట్రై చేశారు.. కానీ పవన్ మాత్రం.. తన చేతులతో.. రామ్ చరణ్ చేతుల్ని పట్టి ఆగమని సైగలు చేశారు. ఇంతలో అక్కడే ఉన్న తన సెక్యూరిటీ, పోలీసులను అలర్ట్ చేశారు.
స్టేజీపైకి తాను, చరణ్ వెళ్తున్నట్లు కళ్లతో పోలీసులకు చెప్పి.. అలర్ట్ గా ఉండేలా సైగలు చేశారు. ఆ తర్వాత బాబాయ్, అబ్బాయ్ కలిపి వేదికపై వెళ్లారు. అందుకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. పిలవగానే వెళ్లకుండా క్రౌడ్ ను కంట్రోల్ చేసిన అనంతరం చాలా జాగ్రత్తగా వెళ్లాలనేది పవన్ ఆలోచనగా క్లియర్ గా తెలుస్తోంది.
రీసెంట్ గా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. హీరో అల్లు అర్జున్ తన పుష్ప-2 మూవీని చూసేందుకు రాగా.. ఆయనను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కొడుకు మృత్యువుతో పోరాడుతున్నాడు. ఆ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది!
అందుకే రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీగా సినీ ప్రియులు, అభిమానులు రావడంతో సంధ్య థియేటర్ ఘటన లాంటివి మళ్లీ జరగకుండా పవన్ జాగ్రత్త పడినట్టు క్లియర్ గా కనిపిస్తుంది. మొత్తానికి సంధ్య థియేటర్ ఘటనతో టాలీవుడ్ అంతా అలెర్ట్ అయినట్లే. రీసెంట్ గా ఏఎంబీలో గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఈవెంట్ జరగ్గా.. అప్పుడు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.