రేర్ ఫీట్.. బాలీవుడ్ బంగారం మ‌న చ‌ర‌ణ్‌!

తెలుగు-త‌మిళంతో పాటు హిందీ బెల్ట్ లో అసాధార‌ణ విజ‌యం సాధించిన ఆర్.ఆర్.ఆర్ లో పెర్ఫామెన్స్ కి ఈ క్రెడిట్ ద‌క్కుతుంది.

Update: 2023-12-09 15:59 GMT

అవును.. ఇన్నాళ్లు టాలీవుడ్ బంగారంగా చ‌ర‌ణ్‌ని పిలుచుకున్నాం. కానీ ఇప్పుడు అత‌డు పాన్ ఇండియా బంగారం. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ బంగారం కూడా. హిందీ చిత్ర‌సీమ ఇప్పుడు అత‌డిని బంగారం అని ముద్దుగా పిలుచుకుంది. తెలుగు-త‌మిళంతో పాటు హిందీ బెల్ట్ లో అసాధార‌ణ విజ‌యం సాధించిన ఆర్.ఆర్.ఆర్ లో పెర్ఫామెన్స్ కి ఈ క్రెడిట్ ద‌క్కుతుంది.

తాను న‌టించిన ఒక్కో సినిమాతో సంచ‌ల‌నంగా మారుతున్న‌ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, `పాప్ గోల్డెన్ అవార్డ్ 2023`లో ``గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్‌`` విజేతగా నిలిచాడు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత ప్రశంసలు పొందిన చిత్రం RRRలో న‌ట‌న‌కుగాను విశిష్టమైన పిలుపును చ‌ర‌ణ్ అందుకున్నాడు. ఆస్కార్ విజేత అయిన ఆర్.ఆర్.ఆర్ నాటు నాటులో అత‌డి న‌ర్త‌న‌కు కూడా ఈ గుర్తింపు ద‌క్కింద‌ని భావించాలి. కళాకారుడిగా, ఫ్యామిలీమ్యాన్ గా.. వ్యవస్థాపకుడిగా అతని బహుముఖ పాత్రలలో అద్భుతమైన విజయాన్ని సాధించిన చ‌ర‌ణ్ కి 2023 గొప్ప‌గా క‌లిసొచ్చింది.

షారుక్ ఖాన్, దీపికా పదుకొణె, అదా శర్మ, రాశీ ఖన్నా ఇలా ఎంద‌రో నామినీలను అధిగమించి రామ్ చరణ్‌కి ఈ విజయం ద‌క్కింది. తీవ్రమైన పోటీ ఉన్న‌ బాలీవుడ్ ఇలాకాలో అతడి అసాధార‌ణ స్టార్ పవర్‌ను ఈ గౌర‌వం నొక్కి చెబుతుంది. ఈ అరుదైన‌ గౌర‌వం, గుర్తింపు ద‌క్క‌గానే చ‌ర‌ణ్ కి సోషల్ మీడియా వేదిక‌లు అభిమానుల నుండి అభినందన సందేశాలు వెల్లువెత్తాయి. ``కింగ్ ఈజ్ కింగ్ -ది గ్లోబల్ హార్ట్‌త్రోబ్ రామ్ చరణ్`` అంటూ ఫ్యాన్స్ ప్ర‌శంసించారు. గ్లోబల్ అప్పీల్ తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులపై చ‌రణ్ చెర‌గ‌ని ముద్ర వేశాడన‌డానికి ఇది నిద‌ర్శ‌నం.

`పాప్ గోల్డెన్ అవార్డ్ 2023`లో రామ్ చరణ్‌కి గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్‌గా పట్టం కట్టినందున త‌దుప‌రి రిలీజ్ కి రానున్న `గేమ్ ఛేంజర్`పై మ‌రింత ఉత్కంఠ పెరిగింది. శంక‌ర్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ తో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో చ‌రణ్ భిన్న‌మైన పాత్ర‌ల‌తో న‌టుడిగా ర‌క్తి క‌ట్టిస్తాడ‌ని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గేమ్ ఛేంజ‌ర్ వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News