సుహాస్ గొర్రె పురాణం.. ముందే తెలుసా?

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తో సుహాస్ హ్యాట్రిక్ హిట్ సాధించారు.

Update: 2024-09-25 10:56 GMT

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. వరుస చిత్రాల షూటింగ్స్ కు అటెండ్ అవుతున్నారు. ఇప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తున్నారు. లైనప్ లో మరిన్ని ప్రాజెక్టులను చేర్చుతున్నారు. ఆయన నటించిన సినిమా అంటే చాలు.. మినిమమ్ గ్యారంటీ అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. ఇప్పటికే ఈ ఏడాదిలో మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తో సుహాస్ హ్యాట్రిక్ హిట్ సాధించారు.

శ్రీరంగనీతులు, ప్రసన్నవదనం సినిమాలతో ఇటీవల వచ్చి మెప్పించారు. మినిమమ్ వసూళ్లు సాధిస్తూ సినీ ప్రియులను అలరించారు. ఇక రీసెంట్ గా సుహాస్ గొర్రె పురాణం మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. అనుకున్న డేట్ కన్నా ఒక రోజు లేట్ గా రిలీజ్ అయింది. సెప్టెంబర్ 21వ తేదీ థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్ కు ముందే.. ప్రమోషనల్ కంటెంట్ ద్వారా గొర్రె పురాణం మూవీ సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కినట్లు క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.

రెండు మతాల మధ్య గొడవలకు కారణమైన ఒక గొర్రెకు, అప్పటికే జైల్లో ఉన్న ఖైదీ (సుహాస్)కి ఏంటి లింక్ అనే పాయింట్ చుట్టూ గొర్రె పురాణం సినిమా తిరిగింది. అయితే కాన్సెప్ట్ వెరైటీదే అయినా.. తెరకెక్కించే విధానం కరెక్ట్ లేకపోవడంతో మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. దానికి తోడు ప్రమోషన్స్ అసలు జరగలేదు. మూవీపై ఆడియన్స్ లో బజ్ క్రియేట్ అవ్వలేదు. రిలీజ్ అయ్యాక టాక్ కూడా బాగాలేదు. దీంతో గొర్రె పురాణం.. ఫ్లాప్ గా మిగిలింది.

అదే సమయంలో సోషల్ మీడియాలో మరో డిస్కషన్ జరుగుతుంది. గొర్రె పురాణం మూవీ ప్రమోషన్స్ లో సుహాస్ అస్సలు కనిపించలేదు. ప్రమోషన్స్ కు ఆయన దూరంగా ఉన్నారు. ట్రైలర్ లాంఛ్ కు అటెండ్ అవ్వలేదు. దీంతో మేకర్స్ మిగతా ప్రమోషనల్ ప్లాన్స్ ను క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే సుహాస్ రాకపోవడానికి కారణం ఎవరికీ తెలియదు. నెట్టింట కారణాలు ఇవేనని పలు వార్తలు వచ్చినా.. వాటిపై గొర్ర పురాణం మేకర్స్ గానీ హీరోగా ఎక్కడా స్పందించలేదు.

ఇప్పుడు మూవీ రిలీజ్ అయ్యాక.. కంటెంట్ రిజల్ట్ తెలిసే సుహాస్ ప్రమోషన్స్ కు దూరమయ్యాడా అని కొందరు నెటిజన్లు అనుమానపడుతున్నారు. అదే సమయంలో సుహాస్ వరుస సినిమాలు త్వరలో రిలీజ్ కానున్నాయి. దసరాకు జనక అయితే గనక రానుంది. ఓవర్సీస్ లో సుహాసే రిలీజ్ చేస్తున్నారు. ఆ తర్వాత కేబుల్ రెడ్డి, ఉప్పు కప్పురంబు, ఆనందరావు అడ్వెంచర్స్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరి అప్ కమింగ్ చిత్రాలతో ఎలాంటి హిట్స్ అందుకుంటారో చూడాలి.

Tags:    

Similar News