గజేంద్రుడి సరసన తడిసిన అందాలతో నటి ఆటలు!
మూగ జీవాలతో ఆటలొద్దని అటవీ అధికారులు ఎప్పటిప్పుడు హెచ్చరిస్తుంటారు.
మూగ జీవాలతో ఆటలొద్దని అటవీ అధికారులు ఎప్పటిప్పుడు హెచ్చరిస్తుంటారు. మనుషులు తినే ఫుడ్ జంతువులకు పెట్టొద్దని హెచ్చరిక బోర్డులుంటాయి. ముఖ్యంగా వాటిని దూరం నుంచి చూసి ఆస్వాదించాలి తప్ప దగ్గరకెళ్లి సరసాలు ఆడొద్దని హెచ్చరిస్తుంటారు. అలా సరసాలు ఆడితే ఎలాంటి పరిస్థితులు తలెత్తు తాయో తెలిసే అధికారులు ముందు జాగ్రత్త చర్యగా హెచ్చరిస్తుంటారు.
అయినా సరే ఆ రూల్స్ పాటించేది ఎంతమంది? మీ పని మీది అయితే మా పని మాది? అన్న ధోరళిలోనే సన్నివేశం కనిపిస్తుంది. తాజాగా నటి కావ్యా కళ్యాణ్ రామ్ ఫారెస్ట్ లో ఏనుగులతో కలిసి జలాకాలాట ఆడుతోన్న కొన్ని ఫోటోలను ఫోస్ట్ చేసింది. అందులో ఇద్దరు మహిళలు ఏనుగుల పక్కకు వీళ్లు..వాటీ వీపు మీద పడి మరీ ఫోటోలు దిగారు. ఏనుగు తొండంతో వీపుమీదకు నీళ్లు చీమ్ముకుంటుంది? వాటికింద నిలబడ్డారు.
ఏదో సినిమా షూటింగ్ లో భాగంగా శ్రీలంక నుంచి వచ్చిన ఫోటోలివి. అయితే ఈ ఫోటోలు తీసుకుంటోన్న సమయంలో ఏనుగులకు ఎలాంటి హానీ తలపెట్టలేదదని కావ్య రాసుకొచ్చింది. ఇద్దరు తడిసిన దుస్తుల్లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏనుగులతో ఫోటోలు దిగడం తప్పు కాదు. కానీ అటవీ ఏనుగుల స్వభావం ఎలా ఉంటుందో అంచనా వేడయం కష్టమని వాటితో పోటోలు దిగొద్దని అధికారులు హెచ్చరించడం తెలిసిందే.
కావ్యా కళ్యాణ్‌రామ్ సుపరిచితమే. బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన కావ్య `మసూద`..`బలంగం` చిత్రాలతో హీరోయిన్ అయింది. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో గుర్తింపు దక్కింది. గత ఏడాది `ఉస్తాద్` సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ అమ్మడు ఇంకా బిజీ నటిగా మాత్రం మారలేదు.