ఇటు సామ్ అటు డి ఏంజెలిస్ మ‌ధ్య‌లో ఓ మెరుపు!

తాజాగా అమ్మ‌డు లండ‌న్ లో సీటాడెల్ స్పెష‌ల్ స్క్రీనింగ్ స‌మ‌యంలో సంథిగ్ స్పెష‌ల్ గా హైలైట్ అయింది.

Update: 2024-09-25 10:27 GMT

గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇప్పుడంతా అంత‌ర్జాతీయ స్థాయిలో స్టార్ డ‌మ్ అస్వాదిస్తోంది. నిక్ జోనాస్ ని పెళ్లి చేసుకుని కాపురం న్యూయార్క్ లో పెట్టిన నాటి నుంచి? అమ్మ‌డు అక్క‌డ మ‌రింత యాక్టివ్ గా కొన‌సాగుతుంది. అలాగ‌ని ఇండియాని విడిచి పెట్ట‌లేదు. ఇక్క‌డ బాలీవుడ్ కి ట‌చ్ లో ఉంటూనే? హాలీవుడ్ ని దున్నేస్తుంది. తాజాగా అమ్మ‌డు లండ‌న్ లో సీటాడెల్ స్పెష‌ల్ స్క్రీనింగ్ స‌మ‌యంలో సంథిగ్ స్పెష‌ల్ గా హైలైట్ అయింది.

ఈ సంద‌ర్భంగా టాలీవుడ్ నుంచి ....ఇటాలియ‌న్ న‌టి మ‌టిల్డా డి ఏంజెలిస్ కూడా హాజ‌ర‌య్యారు. ముగ్గురు అంద‌గత్తెలు కెమారాకిచ్చిన ఫోజులిప్పుడునెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. స‌మంత బ్లూ రంగు ఔట్ ఫిట్లో అందంగా ముస్తాబ‌వ్వ‌గా, మెరుపుల దుస్తుల్లోమ‌టిల్డా హైలైట్ అవుతోంది. మ‌ధ్య‌లోనారింజ రంగులో పీసీ మిరుమిట్లు గొలుపుతుంది. వీళ్ల‌తో పాటు ఇండియ‌న్ వెర్ష‌న్ సీటాడెల్ ద‌ర్శ‌క నిర్మాత‌లు రాజ్ అండ్ డీకే కూడా హాజ‌ర‌య్యారు.

ముద్దుగుమ్మ‌లు ముగ్గురు ఎంతో అందంగా హైలైట్ అవుతున్నారు. వాలి అలంక‌రణ ప్ర‌తీది నెటి జ‌నుల్ని ఆక‌ర్షిస్తుంది. ముఖ్యంగా డి ఎంజెలిస్ విదేశీ న‌టి అయినా ట్రెడీష‌న‌ల్ గా ముస్తాబ‌వ్వ‌డం విశేషం. ఇద్ద‌రు భార‌తీయ న‌టుల మ‌ధ్య‌లో తాను సంప్ర‌దాయాల్ని పాటించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అలాగే మొన్న‌టివ‌ర‌కూ ముంబైలో ఉన్న స‌మంత స‌డెన్ గా లండ‌న్లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యే స‌రికి అభిమాను లంతా షాక్ అవుతున్నారు. అమ్మ‌డు ఈ మ‌ధ్య ముంబై టూ అమెరికా టూర్ ఎక్కువ‌గా వేస్తుంద‌ని పోస్టులు పెడుతున్నారు.

Tags:    

Similar News