చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారానికి రాష్ట్ర అతిధిగా మెగాస్టార్!

మెగా ఫ్యామిలీ-నంద‌మూరి ఫ్యామిలీ-నారా ఫ్యామిలీ మ‌ధ్య పొలిటిక‌ల్ బాండింగ్ మామూలుగా లేదిప్పుడు.

Update: 2024-06-11 09:12 GMT

మెగా ఫ్యామిలీ-నంద‌మూరి ఫ్యామిలీ-నారా ఫ్యామిలీ మ‌ధ్య పొలిటిక‌ల్ బాండింగ్ మామూలుగా లేదిప్పుడు. రాష్ట్రం లో వైకాపాను ప‌డ‌గొట్ట‌డం కోసం ఆ రెండు ఫ్యామిలీలు క‌లిసిన నాటి నుంచి జ‌యకేతనం ఎగ‌ర వేసేవ‌ర‌కూ ఎంతో స‌మిష్టిగా క‌లిసి ప‌నిచేసాయి. ఇక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డిన స‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ టీడీపీతో పొత్తు ప్ర‌క‌టించ‌డంతో ఆ బాండింగ్ మ‌రింత బ‌లంగా పెన‌వేసుకుపోయింది.

చంద్ర‌బాబు నాయుడు-ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాలు నీళ్ల‌లా క‌లిసి ప‌నిచేసారు. చంద్ర‌బాబుకు సేవ‌కుడిగా, విధేయుడిగా ప‌వ‌న్ అందించిన సేవ‌లు అందించి ఎన్నిక‌ల్లో గేమ్ ఛేంజ‌ర్ గా నిలిచారు. చివ‌రికి అన్న‌య్య నాగాబు కూడా పోటీ చేయాల్సిన స్థానాన్ని కూడా త్యాగం చేసారు. అలా జ‌న‌సేన -టీడీపీ మ‌ధ్య మంచి స‌ఖ్య‌త కుద‌ర‌డంతోనే ప్ర‌యాణం దిగ్విజ‌యంగా సాగుతుంది. ఇప్ప‌టికే కేంద్రంలో మోడీ ప్ర‌మాణ స్వీకారం ముగిసింది.

ఇక ఏపీలో నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌మాణ‌స్వీకారం పూర్తి చేయాల్సి ఉంది. బుధ‌వారం అమ‌రావ‌తిలో గ్రాండ్ గా ప్ర‌మాణ‌స్వీకారం జ‌రుగుతుంది. దానికి సంబంధించిన ప‌నులు ఇప్ప‌టికే దాదాపు పూర్త‌య్యాయి. ఈ కార్య‌క్ర‌మానికి పెద్ద ఎత్తున రాజకీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతారు. చంద్ర‌బాబు నాయుడితో సాన్నిహిత్యం ఉన్న ఉద్దండులంతా త‌ప్ప‌క పాల్గొంటారు. మ‌రి ఈ వేడుక‌లో స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ ఎవ‌రైనా ఉన్నారా? అంటే మెగాస్టార్ చిరంజీవి ఉన్నార‌ని తెలుస్తోంది.

రాష్ట్రం త‌రుపున రాష్ట్ర అతిధిగా మెగాస్టార్ ని చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేక ఆహ్వానం అందించిన‌ట్లు స‌మాచారం. ఈరోజు సాయంత్రానికి చిరంజీవి ప్ర‌త్యేక ప్లైట్ లో అమ‌రావ‌తికి చేరుకుంటార‌ని స‌న్నిహిత వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. చిరంజీవి ఎంట్రీతో వేదిక మ‌రింత శోభాయమానం గా మారుతుంది. ఓవైపు చిరంజీవి ..మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌...మ‌ధ్య‌లో చంద్ర‌బాబు నాయుడు. ఆ కాంబినేష‌న్ అద్భుత‌మే క‌దా.

Tags:    

Similar News