భోళా భజన బ్యాచ్.. ఇప్పటికైనా ఆలోచిస్తే బెటర్
తాజాగా విడుదలైన 'భోళాశంకర్'లో జబర్దస్త్ బ్యాచ్ అందరికీ అవకాశాలు వచ్చాయని అనే వాదన కూడా వినిపిస్తోంది.
చిరంజీవి రేంజ్ క్రేజ్, పాపులారిటీ ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్, యూనివర్సల్ స్టార్ కమల్ లాంటి హీరోలు తమ ఏజ్ కు తగ్గ సినిమాలు చేస్తూ.. 'విక్రమ్', 'జైలర్' వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్నారు. కానీ చిరంజీవి మాత్రం ఇంకా హీరోయిన్స్ తో డ్యాన్సులు వేస్తూ, ఏజ్ ను కవర్ చేస్తూ రొటీన్ కథలతో కామెడీ చేస్తూ కాస్త విమర్శలను అందుకుంటున్నారు.
ఇంకా చెప్పాలంటే.. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది చిరంజీవి అభిమానులు, జబర్దస్త్ షో బ్యాచ్ అంతా చిరు చుట్టూ చేరి భజన చేస్తూ.. ఆయన ఏం చేసినా పొగుడుతూ చిరుకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని ఈ మధ్య కాలంలో టాక్ వినిపిస్తోంది. ఆ మధ్యలో ఈ సినిమా ప్రమోషన్స్ లో పలువురు జబర్దస్త్ కమెడియన్లు చిరును పొగడ్తలతో ముంచెత్తారు. ఇంకా పలు సందర్భాల్లోనూ చిరు భజనే చేస్తూ కనిపించారు.
అందుకే తాజాగా విడుదలైన 'భోళాశంకర్'లో జబర్దస్త్ బ్యాచ్ అందరికీ అవకాశాలు వచ్చాయని అనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఈ 'భోళాశంకర్'లో నటించిన జబర్దస్త్ బ్యాచ్ కామెడీ బెడిసి కొట్టినట్టే ఉందని బయట మాటలు వినిపిస్తన్నాయి. కామెడీ వర్కౌట్ అవ్వలేదని అంటున్నారు. అలాగే శ్రీముఖితో చేసిన రొమాంటిక్ కామెడీ కూాడా తేడా కొట్టిందని చెబుతున్నారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మేనరిజంను అనుకరిస్తూ ఆమెతో చేసిన ఖుషి నడుము సీన్ రీ క్రియేట్ బెడిసి కొట్టేసింది. థియేటర్స్ లో విజిల్స్ పడాల్సింది సోషల్ మీడియాలో ట్రోల్స్ పడుతున్నాయి. ఇంకా యాంకర్ రష్మీ గౌతమ్ ను కిల్లి చుట్టిచ్చే మసాలా పిల్లగా చూపించడం సింక్ కాలేకపోయిందని చెబుతున్నారు.
మొత్తంగా చిరంజీవి తన స్థాయికి తగ్గట్టు మంచి కథలను ఎంచుకుని, రోటీన్ కామెడీని పక్కనపెట్టాలని ఫ్యాన్స్, సినీ ప్రియులు సూచిస్తున్నారు. జబర్దస్త్ బ్యాచ్ భజనకు పడిపోకుండా.. అవసరం ఉంటే తప్ప అనవసరమైన సన్నివేశాల కోసం అదనపు ఆర్టిస్టులను తీసుకోవద్దని కోరుతున్నారు. మరి ఈ విషయాన్ని చిరు పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి..