మెగాస్టార్ ను తప్పుగా ట్రోల్ చేస్తున్నారా?

మెగాస్టార్ చిరంజీవి వీలైనంతవరకు కాంట్రవర్సీలకు చాలా దూరంగానే ఉంటారు. ఎలాంటి సెన్సిటివ్ అంశాలపై అయినా సరే సున్నితంగా స్పందించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు

Update: 2023-11-16 08:24 GMT

మెగాస్టార్ చిరంజీవి వీలైనంతవరకు కాంట్రవర్సీలకు చాలా దూరంగానే ఉంటారు. ఎలాంటి సెన్సిటివ్ అంశాలపై అయినా సరే సున్నితంగా స్పందించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియా ప్రపంచంలో ఎంత మంచి హీరో అయినా కూడా ట్రోల్స్ ఎదుర్కోక తప్పదు. అంతే కాకుండా ఎంత చెడ్డ హీరో అయినా సరే కొన్నిసార్లు హీరో ఎలివేషన్స్ కూడా అందుకుంటూ ఉంటాడు.

ఇక మెగాస్టార్ చిరంజీవి ఇటీవల డాన్స్ చేసిన విధానంపై కూడా ట్రోలింగ్ గట్టిగానే వచ్చింది. అయితే ఓవర్గం అభిమానులు మాత్రం ఆ తరహా డాన్స్ సినిమాల్లో కూడా కావాలని కోరుకుంటే మరి కొంతమంది మాత్రం తప్పుగా ఆలోచించి ఆ వీడియోను ట్రోల్ కూడా చేశారు. మెగాస్టార్ చిరంజీవి దీపావళి సందర్భంగా కొంతమంది సెలబ్రిటీలతో ప్రత్యేకంగా పార్టీ చేసుకున్నారు.

అయితే అదే వేడుకలో జవాన్ పాటకు కూడా ఒక లేడీ సింగర్ తో కలిసి ఆయన స్టైలిష్ గా స్టెప్పులు కూడా వేశారు. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది. మెగాస్టార్ ఫ్యాన్స్ అయితే ఇలాంటి డాన్స్ వెండితెరపై చూడాలని అనుకుంటున్నాము అన్నట్లుగా స్పందించారు. అయితే మరి కొంతమంది కావాలని దాని పైన ట్రోలింగ్ కూడా చేశారనే కామెంట్స్ వచ్చాయి.

అయితే ఇదంత ఒక సైడ్ అయితే మరొకవైపు నుంచి మెగాస్టార్ చిరంజీవి లేడీ సింగర్ తో డాన్స్ చేస్తూ చివరిగా ఆయన ఆమె దగ్గర వెళ్లిన విధానాన్ని కూడా తప్పుగా హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. నిజానికి మెగాస్టార్ చిరంజీవి ఆ విధమైన అంశాలకు చాలా ధూరంగా ఉంటారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు నెగిటివ్ గా కామెంట్ చేసిన మహిళలపై కూడా ఆయన ఏమాత్రం నెగటివ్ కామెంట్స్ చేయలేదు.

అయితే ఇప్పుడు సింగర్ తో ఉన్న వీడియోను తప్పుగా ట్రోల్ చేస్తున్నట్లుగా ఓ వర్గం అభిమానులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనాప్పటికీ చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి డాన్స్ వీడియోతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయారు. ఇక ఆయన తదుపరి సినిమాను వశిష్ట దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ ఈ ఏడాది డిసెంబర్లో మొదలు కాబోతోంది.

Tags:    

Similar News