రజనీ లా చిరు సీతయ్యలా ముందుకెళ్తారా?
సూపర్ స్టార్ రజనీకాంత్ సీతయ్య టైపు. ఆయన ఎవరి మాట వినరు. ఏ పని తలపెట్టినా మొండిగా ముందుకెళ్లిపోతారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ సీతయ్య టైపు. ఆయన ఎవరి మాట వినరు. ఏ పని తలపెట్టినా మొండిగా ముందుకెళ్లిపోతారు. సినిమా అయినా....వ్యక్తిగత వ్యవహరమైనా రజనీ శైలి అలాగే ఉంటుంది. ఇటీవలే రిలీజ్ అయిన `జైలర్` విషయంలో అదే జరిగింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన దీలిప్ కుమార్ అప్పటికే ప్లాప్ ల్లో ఉన్నాడు. అతనితో సినిమా చేయోద్దని రజనీ కిచాలా మంది ఉచిత సలహాలు ఇచ్చారు. నిర్మాతల నుంచి అభిమానుల వరకూ అతనితో సినిమా ఏంటని వారించారు.
కానీ రజనీ మాత్రం వాళ్లెవ్వర్నీ పట్టించుకోలేదు. తాను మాట ఇచ్చారు కాబట్టి..ఇచ్చిన మాటకి కట్టుబడి సినిమా చేసి సక్సెస్ అయ్యారు. `జైలర్` మంచి విజయం సాధించింది. మరి తాజా సినారేలో మెగాస్టార్ చిరంజీవి కూడా రజనీ..సీతయ్యని ఫాలో అయిపోతారా? అన్నది చూడాలి. చిరంజీవి హీరోగా.. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన `భోళా శంకర్` నిన్న రిలీజ్ అయి ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో తెలిసిందే.
తొలి షోతోనే సినిమా లో మ్యాటర్ లేదని తేలిపోయింది. సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇలాంటి కథతో చిరంజీవి సినిమా చేయడం ఏంటని అభిమానులు అసంతృప్తికి లోనవుతున్నారు. ఇదంతా పక్కనబెడితే పదేళ్ల తర్వాత ఎలాంటి అవకాశాలు లేని మెహర్ రమేష్ కి ఈ ఛాన్స్ ఇచ్చారు చిరు. ఆ మాటకి రమేష్ ఒక్క శాతం కూడా న్యాయం చేయలేకపోయారు. మూస సినిమా చేసి విమర్శలు ఎదుర్కుంటున్నారు.
వాస్తవానికి ఈ సినిమా కమిట్ అయినప్పుడే రమేష్ కి..చిరు ఛాన్స్ ఇవ్వడం ఏంటి? అన్న అంశంపై పెద్ద డిబేట్ నడించింది. కానీ దర్శకుడిలో ఏదో యూనిక్ స్టైల్ అలా లాక్ చేసింది. చేసారు ఫెయిలయ్యారు. ఇదంతా గతం కింద లెక్క. తదరుపరి చిరంజీవి నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఇక్కడ ఆసక్తికరం. ఎందుకంటే కళ్యాణ్ కృష్ణ అనే దర్శకుడితో చిరు సినిమా చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అతని కథని లాక్ చేసి పెట్టారని..`భోళా శంకర్` రిలీజ్ కి ముందు నుంచే ప్రచారం సాగుతుంది.
కళ్యాణ్ కి పోటీగా పలువురు దర్శకులు ఉన్నా చిరు-కళ్యాణ్ కృష్ణకే డేట్లు ఇచ్చినట్లు వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనతో సినిమా ఏంటని నెట్టింట చిలవలు పలవులుగా నెగిటివ్ కథనాలు వైరల్ అయ్యాయి. కళ్యాణ్ కృష్ణ నాలుగు సినిమాలు చేస్తే అందులో రెండు యావరేజ్ గా ఆడాయి. ఆ తర్వాత మిగతా హీరోలెవరు అవకాశాలు ఇవ్వలేదు. ఈనేపథ్యంలో చిరు లిస్ట్ లో ఆయన పేరు వినిపిస్తుంది. మరి ఈ విషయంలో చిరు సీతయ్యలా ముందుకెళ్తారా? వెనకడుగు వేస్తారా? అన్నది చూడాలి.