మెగా - వశిష్ఠ.. రిలీజ్ టార్గెట్​ ఇదే!

బింబిసారతో అటు ఇండస్ట్రీని, ఇటు ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వశిష్ఠ. ఇప్పుడాయన మెగాస్టార్ చిరంజీవితో ఓ సోషియో ఫాంటసీ సినిమా చేయబోతున్నారు.

Update: 2023-09-23 05:36 GMT

బింబిసారతో అటు ఇండస్ట్రీని, ఇటు ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వశిష్ఠ. ఇప్పుడాయన మెగాస్టార్ చిరంజీవితో ఓ సోషియో ఫాంటసీ సినిమా చేయబోతున్నారు. పంచభూతాల కాన్సెప్ట్​తో ఇది రూపొందుతోంది. ప్రేక్షకులు కూడా చిరును వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌ల్లో చూడాల‌ని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టే.. వశిష్ఠ కూడా చిరును తన సినిమాలో అలానే చూపించబోతున్నట్లు తెలిపారు. అలాగే ఈ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుందో కూడా వివరాలు బయటకు వచ్చాయి.

తాను చిన్న‌త‌నంలో జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి సినిమా చూసి ఎంత‌గానో ఎంజాయ్ చేసినట్లు గుర్తుచేసుకున్న వశిష్ఠ.. అప్ప‌టి పిల్ల‌ల‌కు ఆ చిత్రం బాగా ఆకట్టుకుందని.. అలాగే ఇప్ప‌టి పిల్ల‌లు కూడా చిరును అలానే చూపించబోతున్నట్లు స్పష్టత ఇచ్చారు. సినిమాలో హీరోయిన్లు ఉంటారు కానీ, రొమాన్స్ వంటి సీన్లు ఉండవని ఈ కామెంట్స్​తో క్లారిటీ ఇచ్చేశారు వశిష్ఠ. ఫాంట‌సీకి తగ్గట్టే సినిమా న‌డుస్తుంద‌ని చెప్పేశారు.

అయితే ఈ చిత్రంలో ఎక్కువ మంది హీరోయిన్లు.. ఇతర పాత్రల్లో కనిపిస్తారని చెబుతున్నారు. అయితే గత కొద్ది ప్రచారం ఉన్న అనుష్కనే.. ఒక హీరోయిన్​గా లాక్ చేసినట్లు తెలిసింది. మరో ముగ్గురు హీరోయిన్స్ కూడా ఉంటారట. అయితే ఆ పాత్రల్లో ఎవరు తీసుకోవాలనేది ఇంకా ఫైనలైజ్​ చేయలేదట.

ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. నవంబర్ లేదా డిసెంబర్ నెల నుంచి రెగ్యులర్ షూట్ జరుపుకోనుందని తెలిసింది. 2025 సంక్రాంతికి లేదా మార్చికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నారట. అందుకు తగ్గట్టు ప్లాన్స్​ వేసుకుని షెడ్యూళ్లను రెడీ చేసుకుంటూ ముందుకెళ్తారని తెలిసింది.

ఇక ఈచిత్రంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారట. ఇందుకోసంపలు స్టూడియోస్‌తో చర్చలు జరుపుతున్నట్లు వశిష్ఠ తెలిపారు. అయితే అన్నింటికీ మించి స్టోరీ, స్క్రీన్‌ప్లేనే సినిమాకు బలమని, అది ఈ చిత్రంలో కచ్చితంగా ఉంటుందని అన్నారు. కాగా, క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కాల్సి మెగా 156 సినిమాను ప్రస్తుతానికి పక్కకు పెట్టి.. మెగా 157 చిత్రాన్నే ముందు సెట్స్​పైకి తీసుకెళ్లాలని చిరు చూస్తున్న‌ట్లు స‌మాచారం అందింది.

Tags:    

Similar News