విశ్వంభర : అన్ని ప్రశ్నలకు రిలీజ్ ముందే..!

వచ్చే నెలలో మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ రోజున విశ్వంభర కాన్సెప్ట్‌ వీడియోను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

Update: 2024-07-07 09:58 GMT

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా బింబిసార దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు సినిమా స్థాయిని మరింత పెంచడంతో పాటు, రోజు రోజుకు ఆసక్తి పెంచుతున్నాయి అనడంలో సందేహం లేదు.

హీరోయిన్‌ త్రిష తో పాటు ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెల్లు అంటూ నలుగురు ఐదుగురు ముద్దుగుమ్మలు ఇంకా మృణాల్ ఠాకూర్ కూడా ఈ సినిమాలో కనిపించబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఇంత మంది హీరోయిన్స్ ఎందుకు, అసలు చిరంజీవి అంత మంది చెల్లెల్లకు అన్నయ్య ఎలా అయ్యాడు? సినిమాలో అన్నయ్య పాత్ర ఏంటి? అంటూ ఫ్యాన్స్ గందరగోళానికి గురి అవుతున్నారు.

చిరంజీవి తో పాటు ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది అంటూ మేకర్స్ చెబుతున్నారు. సోషియో ఫాంటసీ సినిమా అంటూ మొదటి నుంచి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కథ ఎలా ఉంటుంది, చిరంజీవిని ఏ పాత్ర లో చూస్తామనే ఆసక్తి కూడా అందరిలో ఉంది.

ఇక చిరంజీవి ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ తన సినిమాలతో నిరాశ పరిచిన నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు మరింతగా ఉన్నాయి. అందుకే ఈ సినిమా గురించి మరీ ఎక్కువ వెయిట్‌ పెంచకుండా దర్శక నిర్మాతలు జాగ్రత్త పడుతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఫ్యాన్స్ మరియు ప్రేక్షకుల్లో ఉన్న ప్రశ్నలు అన్నింటికి కూడా రిలీజ్ కి ముందే సమాధానాలు ఇవ్వబోతున్నారట.

వచ్చే నెలలో మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ రోజున విశ్వంభర కాన్సెప్ట్‌ వీడియోను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ వీడియోలో సినిమాకు సంబంధించిన ఒక క్లీయర్ పిక్చర్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇక సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్న నేపథ్యంలో అంతకు ముందు విడుదల అయ్యే ట్రైలర్‌ లో మరింత స్పష్టంగా కథ గురించి, పాత్రల గురించి వివరణ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మొత్తానికి విశ్వంభర సినిమాను చూడ్డానికి వెళ్లే సమయంలో ఆసక్తి మాత్రమే ఉండాలి కానీ, ప్రశ్నలు ఉండవద్దు అనే కాన్సెప్ట్‌ తో మేకర్స్ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

Tags:    

Similar News