#పద్మవిభూషణ్.. చిరు నన్ను తీర్చిదిద్దారన్న చరణ్
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక ఐకాన్ అయిన మెగా స్టార్ చిరంజీవి సినిమా, కళలకు చేసిన విశేష సేవలకు గాను ఈ గౌరవం పొందారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి, మెగా స్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డును ప్రదానం చేసినందుకు సోషల్ మీడియాలో హృదయపూర్వక సందేశాన్ని షేర్ చేసారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక ఐకాన్ అయిన మెగా స్టార్ చిరంజీవి సినిమా, కళలకు చేసిన విశేష సేవలకు గాను ఈ గౌరవం పొందారు.
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, హిందీ సహా బహు భాషలలో 156 పైగా చిత్రాలలో నటించిన ఆయన అత్యంత విజయవంతమైన గౌరవనీయమైన కెరీర్ ని సాగించారు. ఇది చిరుకు రెండవ పద్మ అవార్డు. 2006లో పద్మ భూషణ్ అందుకున్న చిరంజీవి ఇప్పుడు పద్మవిభూషణ్ పురస్కారం దక్కించుకున్నారు. వినోద ప్రపంచంలో విశిష్ట వ్యక్తిగా అతడి హోదాను ఈ పురస్కారం మరింత పటిష్టం చేసింది.
తన తండ్రి సాధించిన ఘనతను చూసి గర్విస్తున్న రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా తన అభినందనలు తెలిపాడు. ఒక ట్వీట్‌లో ``ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అందుకున్నందున @KChiruTweets కి అభినందనలు! భారతీయ సినిమా, ఈ సమాజానికి మీ సహకారం.. నన్ను తీర్చిదిద్ది అసంఖ్యాక అభిమానులను ప్రేరేపించడంలో కీలక పాత్ర పోషించింది. మీరు ఈ గొప్ప దేశానికి నిష్కళంకమైన పౌరులు..ఈ గౌరవం గుర్తింపునకు కారణమైన భారత ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీజీకి చాలా కృతజ్ఞతలు`` అని అన్నారు. మద్ధతునిచ్చిన అభిమానులు & శ్రేయోభిలాషులందరికీ బిగ్ షౌటింగ్. ఇదిగో మీకు దక్కిన గౌరవం #మెగాస్టార్ #పద్మవిభూషణ్ #పద్మవిభూషణ్ చిరంజీవి.. అని హ్యాష్ ట్యాగుల్ని జోడించారు.
భారతదేశంలోని అత్యున్నత పౌర గౌరవాలలో ఒకటైన పద్మవిభూషణ్, కళలు, సాహిత్యం, క్రీడలు, ప్రజా సేవ సహా వివిధ రంగాలలో వారి అసాధారణ సేవలకుగాను వ్యక్తులను గుర్తింపును కల్పిస్తుంది. మెగా స్టార్ చిరంజీవి అసాధారణ ప్రయాణాన్ని, అత్యుత్తమ విజయాలను ప్రశంసించడానికి మొత్తం సినీ సోదరులు అభిమానులు ఉత్సాహంగా ఓ వేదికకు చేరారు. సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే చిరుకు విషెస్ వెల్లువెత్తాయి. గర్వించదగిన కొడుకుగా రామ్ చరణ్ ఇప్పుడిలా విషెస్ తో ఉత్సాహం నింపారు.
అల్లు - నాగ్ విషెస్..
చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన తర్వాత నాగార్జున అభినందించారు. ఈ సంవత్సరం పద్మవిభూషణ్ లు అందుకున్న ఐదుగురిలో చిరంజీవి ఒకరు కాగా, తన స్నేహితుడు నాగార్జున ఎక్స్ ఖాతాలో ఇలా రాసారు. ``ప్రియమైన @Kchirutweets కి చాలా అభినందనలు. #పద్మవిభూషణ్‌తో సత్కారానికి నిన్ను చూసి గర్విస్తున్నాను.. నీ స్నేహితునిగా ఉన్నందుకు గౌరవం!! #పద్మ అవార్డ్స్ 2024`` అని రాసారు. చిరంజీవి కోసం హృదయపూర్వక నోట్‌ను రాసిన వారిలో అల్లు అర్జున్ కూడా ఉన్నారు.
అల్లు అర్జున్ తన X (గతంలో ట్విట్టర్) హ్యాండిల్‌లో చిరంజీవి స్కెచ్‌ను షేర్ చేసారు. ఈ మహత్తర ఫీట్‌పై తెలుగు మెగాస్టార్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ నోట్‌తో పాటు. అందులో, ``పద్మ విభూషణ్ తో గౌరవం అందుకున్నందుకు మా మెగాస్టార్ @KChiruTweets గారికి అభినందనలు. కుటుంబానికి, అభిమానులకు తెలుగు ప్రజలకు ఎంతో గౌరవం. ఈ విజయంతో నేను చాలా ఉల్లాసంగా ఉన్నాను. ఇది గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. మా అందరినీ చాలా గర్వించేలా చేసినందుకు ధన్యవాదాలు`` అని అన్నారు.