1000 కోట్లు.. కోలీవుడ్ కి కలగా మారిందా..?
కానీ గత ఐదారేళ్లుగా టాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో సృష్టిస్తున్న సంచలనాలు చూసి అందరు షాక్ అవుతున్నారు
ఓ పక్క తెలుగు పరిశ్రమ వరుస పాన్ ఇండియా సినిమాలతో 500 కోట్లు, 1000 కోట్లు వసూళ్లతో అదరగొడుతుంటే పక్కన ఉన్న కోలీవుడ్ మాత్రం 1000 కోట్ల మార్క్ అన్నది అందని ద్రాక్ష లానే మిగిలిపోయిందని బాధపడుతుంది. తమిళ చిత్ర పరిశ్రమ టాలీవుడ్ కన్నా ముందే పాన్ ఇండియా సినిమాలు చేసి మెప్పించారు. కానీ గత ఐదారేళ్లుగా టాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో సృష్టిస్తున్న సంచలనాలు చూసి అందరు షాక్ అవుతున్నారు. ముఖ్యంగా తెలుగు నుంచి 1000 కోట్ల సినిమాలు బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ ఈమహ్యనే వచ్చిన కల్కి 2898 ఏడి వచ్చాయి.
అటు శాండల్ వుడ్ నుంచి కూడా KGF 2 1000 కోట్ల వసూళ్లతో సత్తా చాటింది. ఎటొచ్చి కోలీవుడ్ నుంచి ఒక్క 1000 కోట్ల సినిమా రాలేదు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన P.S 1, 2 సినిమాలు ఆ ఫీట్ సాధిస్తాయని అనుకున్నా అది జరగలేదు. ఐతే సూర్య నటించిన కంగువ సినిమా ఆ ఆకలి తీరుస్తుందని అనుకున్నారు. కంగువ ప్రీ రిలీజ్ బజ్ చూసి తమిళ పరిశ్రమ నుంచి 1000 కోట్లు అందుకునే మొదటి సినిమా ఇదే అని అనుకున్నారు. కానీ రిలీజ్ అయ్యాక చూస్తే సీన్ రివర్స్ అయ్యింది.
కంగువ 1000 ఏళ్ల కథ.. 1000 కోట్లు పక్కా అనుకున్న తమిళ తంబీలకు సినిమా పెద్ద షాక్ ఇచ్చింది. సూర్య పెట్టిన ఎఫర్ట్స్ సినిమాకు వచ్చిన టాక్ సరితూగలేదు. డైరెక్టర్ శివ మీద సూర్య పెట్టుకున్న నమ్మకాన్ని అతను నిలబెట్టుకోలేదు. కంగువ సినిమా ఎంతో గ్రాండియర్ గా ఉన్నా కథలో ఎమోషన్ మిస్ అవ్వడం వల్ల ఆడియన్స్ దానికి కనెక్ట్ అవ్వలేదు. తమిళ మీడియా కూడా సినిమా యావరేజ్ అనేలా చెబుతుంది.
సూర్య ఈసారి కోలీవుడ్ పరువు కాపాడేలా కంగువ 1000 కోట్లు కొడుతుందని భావించినా సినిమా టాక్ చూశాక కష్టమే అన్న భావన వస్తుంది. కంగువ చూసిన తెలుగు ఆడియన్స్ కూడా సూర్య కష్టానికి తగిన సినిమా కాదని అంటున్నారు. ఇక ఈ టాక్ తో వసూళ్లు అనుకున్నంత సాధించడం కష్టం. 1000 కోట్లు తర్వాత సంగతి సినిమా లాస్ లేకుండా వసూళ్లు చేస్తే బెటర్ అని చెప్పొచ్చు.
సూర్య కంగువ మీద కోలీవుడ్ సినీ వర్గాలు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ రిలీజైన నాటి నుంచి ఇంటా బయట వస్తున్న టాక్ చూసి వాళ్లు కూడా నిరాశ చెందారని చెప్పొచ్చు.