విశ్వంభర.. సవాళ్లను దాటగలదా..?
మెగాస్టార్ చిరంజీవి బింబిసార ఫేమ్ వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంభర
మెగాస్టార్ చిరంజీవి బింబిసార ఫేమ్ వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంభర. యువి క్రియేషన్స్ వారు 150 నుంచి 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఆఫ్టర్ సైరా నరసింహారెడ్డి మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా ఇదే. ఈ సినిమా కథ కథనాలు అన్నీ మెగా ఫ్యాన్స్ ని మాస్ ట్రీట్ అందిస్తాయని అంటున్నారు. సినిమాతో చిరు మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా చూపించాలని చూస్తున్నారు.
విశ్వంభర సినిమా గ్లింప్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. సినిమా కథ ఏంటన్నది క్లూ ఇవ్వకపోయినా ఇదొక విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారని అర్థమవుతుంది. సినిమాలో చిరుకి జోడీగా త్రిష నటిస్తుండగా మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్, ఈషా చావ్లా ఇలా చాలా మంది భామలు భాగం అవుతున్నారు. సినిమాకు అకాడమీ అవార్డ్ విన్నర్ ఎం.ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.
ఐతే ఈ సినిమా కథ ప్రకారం చూస్తే గ్రాఫిక్స్ కి ప్రాధాన్యత ఎక్కువ ఉండేలా ఉంది. గ్లింప్స్ తో ఆ విషయం స్పష్టమైంది. ఈ తరం ప్రేక్షకులు తమ దగ్గర ఉన్న ఓటీటీల ద్వారా అద్భుతమైన వి.ఎఫ్.ఎక్స్ వర్క్ సినిమాలను చూస్తున్నారు. వాటికి తగినట్టుగా వెండితెర మీద అద్భుతాలు చూపిస్తేనే వావ్ అనేస్తున్నారు. లేదంటే మాత్రం తిప్పికొడుతున్నారు. ఈమధ్య వచ్చిన హనుమాన్, కల్కి సినిమాలు బడ్జెట్ ఎంత అన్నది పక్కన పెడితే విజువల్ ఎఫెక్ట్స్ పరంగా అదరగొట్టాయి.
చిరంజీవి విశ్వంభర సినిమా కూడా అదే రేంజ్ గ్రాఫిక్స్ తో ఉంటుందని తెలుస్తుంది. ఐతే ఈ సినిమా మెగాస్టార్ వింటేజ్ స్టైల్ ని పరిచయం చేస్తుందని అంటున్నారు. విశ్వంభర చిరు కెరీర్ లో మరో జగదేక వీరుడు అతిలోక సుందరి అవుతుందని అంటున్నారు. మెగా విశ్వంభర సినిమా మీద భారీ హైప్ ఉంది. ఈ అంచనాలకు తగినట్టుగా సినిమా వస్తే మాత్రం మెగాస్టార్ చిరంజీవి మరోసారి రికార్డుల లెక్క సెట్ చేస్తాడని చెప్పొచ్చు.
కథ కథనాలే కాదు సినిమాలో గ్రాఫిక్స్ పేలవంగా ఉన్నా కూడా ప్రేక్షకులు సినిమాలను చూడట్లేదు. మెగాస్టార్ చిరంజీవి అంతకుముందు ఇలాంటి సినిమాలు చేశారు. కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన అంజి సినిమా కూడా ఒక రేంజ్ గ్రాఫిక్స్ వర్క్ తో వచ్చింది. ఐతే ఆ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. ఐతే ఈసారి విశ్వంభర తో మాత్రం హిట్ టార్గెట్ పెట్టుకున్నారు చిరంజీవి.