150 ఏళ్ల చ‌రిత్ర‌..300 సినిమాలు అదే 'సినిమా చెట్టు'!

మ‌రి `సినిమా చెట్టు` అనేది ఒక‌టుంద‌ని ఎంత మందికి తెలుసు? అంటే ఈ సినిమా చెట్టు గోదారి జిల్లాల ప్ర‌జ‌ల‌కు బాగా సుప‌రిచితం.

Update: 2024-08-05 11:33 GMT

గ్రామాల్లో ఉండే మ‌హా వృక్షాల‌కు ఎంతో చ‌రిత్ర ఉంటుంది. ఆ మ‌ర్రి చెట్టుకు 50...ఆ వేప చెట్టుకు 100 ఏళ్లు....ఆ గ‌న్నేరు చెట్టుకు 70 ఏళ్లు! అంటూ గ‌ర్వంగా..గొప్ప‌గా మాట్లాడుకుంటాం. ఆ చెట్టు కింద‌కి వెళ్తే చిన్ననాటి జ్ఞాప‌కాల‌న్నీ క‌ళ్ల ముందు క‌దులుతాయి. హృద‌యం ఉప్పొంగుతుంది. మ‌న‌సు లోలోప‌ల మాట్లాడుకుంటుంది. నేనేంటి? అనే గ‌తాన్ని ఒక్క‌సారిగా త‌ట్టి లేపుతుంది. ఇదంతా సాధార‌ణ వృక్షం గురించే.

మ‌రి `సినిమా చెట్టు` అనేది ఒక‌టుంద‌ని ఎంత మందికి తెలుసు? అంటే ఈ సినిమా చెట్టు గోదారి జిల్లాల ప్ర‌జ‌ల‌కు బాగా సుప‌రిచితం. చెట్టుకింద షూటింగ్ అంటే గోదారి ప్ర‌జ‌ల‌కు ఆ మ‌హా వృక్ష‌మే ఇప్ప‌టికీ గుర్తొస్తుంది. కొవ్వూరు మండ‌లం కుమార‌దేవంలోని ఈ మ‌హా వృక్షం కొలువుదీరింది. ఈ చెట్టు వ‌య‌సు దాదాపు 150 ఏళ్లు ఉటుంది. ఆ చెట్టు కింద‌..ఆ చెట్టు చుట్టూ 100..200 కాదు ఏకంగా 300 సినిమాలు షూటింగ్లు జ‌రిగాయి.


'పాడి పంట‌ల‌ను'(1975) నుంచి మొన్న‌టి `రంగ‌స్థ‌లం` (2018) వ‌ర‌కూ ఆ చెట్టు సినిమా షూటింగ్ ల‌కు ఎంతో అనువైన చెట్టుగా చ‌రిత్ర సృష్టించింది. అంటే సినిమాల ప‌రంగా చూసుకుంటే ఆ చెట్టు ఐదుద‌శాబ్దాల పాటు త‌న సేవ‌ల్ని అందించింది. సుప్ర‌సిద్ద ద‌ర్శ‌కులు జంధ్యాల‌, బాపు-ర‌మ‌ణ‌, కె. విశ్వ‌నాధ్, రాఘ‌వేంద‌ర్రావు, వంశీ ఇలా అప్ప‌టి సూపర్ హిట్ సినిమాల ద‌ర్శ‌కులంతా ఆ చెట్టును షూటింగ్ కోసం వినియోగించుకున్నారు. దీంతో చెట్టు ఆ ద‌ర్శ‌కులు ఫేవ‌రెట్ గా మారింది.

చివ‌రిగా ద‌ర్శ‌కుడు సుకుమార్ సైతం `రంగ‌స్థ‌లం` షూటింగ్ ఆ చెట్టు కింద చేసారు. సుకుమార్ కూడా తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ ప్రాంతానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో? రంగ‌స్థ‌లం షూటింగ్ గోదావ‌రి ప్రాంతంలోనే మేజ‌ర్ పార్టు షూటింగ్ చేసారు. దీనిలో భాగంగా ఆ చెట్టు కింద కొన్నిస‌న్నివేశాల్ని చిత్రీక‌రించారు. అలానే త్వరలో రిలీజ్ కాబోతున్న రామ్ చరణ్ గేమ్ చెంజర్ కూడా ఇక్కడ షూట్ చేసారు. అయితే ఇప్పుడా చెట్టు నేల‌కొరిగింది. స‌రిగ్గా గోద‌వ‌రిని అనుకుని ఉన్న ఆ చెట్టు కుమార‌దేవం గ్రామం ఫ‌రిదిలోకి వ‌స్తుంది.

భారీ వ‌ర్షాల‌తో గోదావ‌రి ఉప్పోంగింది. వ‌ర్షాలతో పాటు బ‌ల‌మైన గాలులు కూడా వీయ‌డంతో చెట్టు వేళ్ల‌తో స‌హా తెగిప‌డింది. 150 ఏళ్ల చ‌రిత్ర ఉన్న ఆ చెట్టు కుప్ప కూల‌డంతో ఆ గ్రామ వాసులు..గోదారి జిల్లాల ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా ఆ చెట్టు ఔన్న‌త్యాన్ని, అందించిన సేవ‌ల్ని గుర్తు చేసుకుంటున్నారు.


Full View


Tags:    

Similar News