డాన్స్ ఐకాన్ 2.. ఆహా ప్లాన్ అదిరింది!

హైదరాబాద్ నగరం సాధారణంగా తన చారిత్రిక ప్రదేశాలతో, రుచికరమైన బిర్యానీ భోజనంతోనే ప్రసిద్ధి అని చాలామంది కామెంట్ చేస్తుంటారు. కానీ తాజాగా హుస్సేన్ సాగర్ లో ఓ దృశ్యం హైదరాబాద్ నగర వాసులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

Update: 2025-02-21 11:22 GMT

హైదరాబాద్ నగరం సాధారణంగా తన చారిత్రిక ప్రదేశాలతో, రుచికరమైన బిర్యానీ భోజనంతోనే ప్రసిద్ధి అని చాలామంది కామెంట్ చేస్తుంటారు. కానీ తాజాగా హుస్సేన్ సాగర్ లో ఓ దృశ్యం హైదరాబాద్ నగర వాసులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆహా (aha) ఓటిటి ప్లాట్‌ఫాం, తన పాపులర్ డాన్స్ రియాలిటీ షో డాన్స్ ఐకాన్ సీజన్ 2: వైల్డ్ ఫైర్ ప్రమోషన్ కోసం హుస్సేన్ సాగర్ లోని నగర స్కై లైన్ ని భారీ బిల్ బోర్డ్ లా మార్చేసింది.


నిజంగా, ఈ రియాలిటీ షో ప్రమోషన్ ఇలా ఉంటుందా? అన్నట్టుగా 5 టన్నుల బరువున్న ఫ్లోటింగ్ ఇన్‌స్టాలేషన్‌ను నడివేళ్లతో హుస్సేన్ సాగర్ నడుమ ఉంచారు. 40 అడుగుల పొడవు, 36 అడుగుల ఎత్తుతో తయారు చేసిన ఈ విస్మయకర నిర్మాణం 72×20 అడుగుల బార్జ్ పై నిలబెట్టారు. రాత్రి వేళల్లో లైట్ల కాంతితో మెరిసే ఈ అద్భుతం కేవలం బిల్బోర్డ్ మాత్రమే కాదు, ఓ కొత్త ట్రెండ్ కు ఆరంభం.

సాధారణంగా సినీ ప్రమోషన్స్, టీవీ షోల హోర్డింగ్స్ వంటివి రోడ్ల పక్కన కనిపిస్తాయి. కానీ, నేరుగా నగర హృదయంలోనే, బుద్ధ విగ్రహం పక్కన ఈ గ్రాండ్ ఇన్‌స్టాలేషన్ వేయడం పక్కా మార్కెటింగ్ మాస్టర్ పీస్ అని చెప్పవచ్చు. ఆహా సిఎంఓ విపిన్ ఉన్ని మాట్లాడుతూ, "మేము నిజంగానే డాన్స్ ఐకాన్ 2ని ఒక సరస్సులో వదిలేశాం. ఈ షో హైప్కు సరిపడేలా ప్రమోషన్ ఉండాలని అనుకున్నాం. అందుకే హైదరాబాద్ స్కై లైన్ ని ఒక బిల్ బోర్డ్ లా మార్చాం" అని పేర్కొన్నారు.

సెల్ఫీలు తీయడానికి వస్తున్న యువత, కుటుంబాలు, టూరిస్టులు ఇలా ప్రతి ఒక్కరూ ఆ ఫ్లోటింగ్ డిస్‌ప్లే పక్కన నిలబడి ఫొటోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ #DanceIKON2Wildfire తో షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్‌ తోనే షో హైప్ అమాంతం పెరిగిపోయింది. డాన్స్ ఐకాన్ 2 సీజన్ చాలా హై ఇంటెన్సిటీతో ముందుకు వెళ్తోంది. వలంటీర్ ఎంట్రీలు, రూత్‌లెస్ ఎలిమినేషన్స్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్‌లు.. ఈ సీజన్ ప్రతి ఎపిసోడ్ రియల్ ఎమోషన్స్ తో నిండిపోనుంది.

ప్రతీ శుక్రవారం ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కానున్నాయని ఆహా టీమ్ తెలిపింది. మొత్తానికి, ఆహా ఈ సారి ప్రమోషన్ పరంగా మాత్రమే కాదు, క్రియేటివిటీ పరంగా కూడా కొత్త ట్రెండ్ సెట్ చేసింది. డాన్స్ ఐకాన్ 2: వైల్డ్ ఫైర్ నిజంగానే పేరు తగినట్టుగానే, ప్రమోషన్ స్థాయిలోనూ హైదరాబాద్ ని సరికొత్తగా మార్చేసింది.

Tags:    

Similar News