దసరా సినిమాలు… మూడింటిలో ఇదే కామన్ పాయింట్

ఇదిలా ఉంటే ఈ మూడు సినిమాలలో ఒక కామన్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అయ్యిందని చెప్పొచ్చు.

Update: 2023-10-21 04:26 GMT

ఈ దసరా కానుకగా తెలుగులో భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, కోలీవుడ్ నుంచి డబ్బింగ్ మూవీగా లియో ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. వీటిలో భగవంత్ కేసరి చిత్రానికి సూపర్ హిట్ టాక్ వస్తోంది. మిగిలిన రెండింటికి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. వీకెండ్ లో కలెక్షన్స్ పరంగా మూడింటికి మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.

అయితే లాంగ్ రన్ లో మాత్రం భగవంత్ కేసరి ఆధిపత్యం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూడు సినిమాలలో ఒక కామన్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అయ్యిందని చెప్పొచ్చు. లియో సినిమాలో తన వ్యాపార వృద్ధి కోసం కొడుకు, కూతురుని నరబలి ఇవ్వాలని అనుకునే తండ్రిగా సంజయ్ దత్ పాత్ర ఉంటుంది.

భగవంత్ కేసరి చిత్రంలో కూడా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి నెంబర్ వన్ పొజిషన్ కోసం కొడుకుని చంపుకునే తండ్రిగా విలన్ రోల్ ని చిత్రీకరించారు. టైగర్ నాగేశ్వరరావులో కూడా తండ్రి తలని కొడుకు నరికేస్తాడు. ఈ మూడు సన్నివేశాలు యాదృశ్చికంగా దర్శకులు రాసుకున్న కూడా కథని, అందులో నెగిటివ్ క్యారెక్టర్ ని బలంగా చెప్పడం కోసం చూపించారు.

అయితే మూడు కథల ట్రీట్మెంట్ మాత్రం వేరే విధంగా ఉంటుంది. లియో సినిమా కథకి కొడుకుని బలి ఇవ్వడమే మెయిన్ ఎలిమెంట్ గా ఉంటుంది. దానిని బేస్ చేసుకొని కథనం అంతా నడుస్తుంది. అయితే భగవంత్ కేసరి మెయిన్ స్టొరీ లైన్ కి ఆ సీన్ కి ఎలాంటి సంబంధం ఉండదు. టైగర్ నాగేశ్వరరావులో కూడా మెయిన్ కథ నాగేశ్వరరావు చుట్టూనే తిరుగుతుంది.

ఇలా దసరా బరిలో నిలిచిన మూడు చిత్రాలలో ఒక సన్నివేశం మాత్రం కామన్ గా ఉండటం విశేషం. అలాగే మూడు కథలు కూడా బ్లడ్ అండ్ యాక్షన్ చుట్టూనే తిరుగుతాయి. భగవంత్ కేసరి చిత్రంలో ఎంటర్టైన్మెంట్ అదనంగా ఉండటంతో మూవీ సక్సెస్ టాక్ సొంతం చేసుకొని ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యింది.

Tags:    

Similar News