డేవిడ్ వార్నర్ డిమాండ్.. మాటల్లేవ్ అంతే..!

నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న రాబిన్ హుడ్ సినిమా నెక్స్ ఫ్రై డే ప్రేక్షకుల ముందుకు వస్తుంది.;

Update: 2025-03-20 16:54 GMT

నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న రాబిన్ హుడ్ సినిమా నెక్స్ ఫ్రై డే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల నటించింది. జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఐతే ఈ సినిమా కోసం ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ని తీసుకున్నారన్న విషయం తెలిసిందే. క్రికెట్ లో తన బ్యాటింగ్ తో అదరగొట్టే వార్నర్ పుష్ప సినిమా డైలాగ్స్, రీల్స్ తో తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యాడు.

ఐతే డేవిడ్ వార్నర్ లోని ఈ జోష్ చూసిన వెంకీ కుడుముల రాబిన్ హుడ్ లో అతనికి ఒక ప్రత్యేక పాత్ర ఇచ్చినట్టు తెలుస్తుంది. సినిమాలో డేవిడ్ వార్నర్ రోల్ ఏంటి అది ఎలా ఉంటుంది అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే అయినా ఆ రోల్ మాత్రం కచ్చితంగా ఆడియన్స్ ని అలరిస్తుందని తెలుస్తుంది. రాబిన్ హుడ్ సినిమాలో డేవిడ్ వార్నర్ రోల్ 5 నిమిషాల దాకా ఉంటుందట.

ఈమాత్రం దానికే అంత హడావిడి అవసరామా అంటే చేసింది ఐదు నిమిషాల పాత్ర అయినా దాని ఇంపాక్ట్ బాగుంటుందని టాక్. అంతేకాదు ఈ రోల్ కోసం డేవిడ్ వార్నర్ భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సినిమాలో ఈ 5 నిమిషాల రోల్ కోసం వార్నర్ 4 రోజుల షూటింగ్ చేశాడట. ఐతే ముందు రోజుకి కోటి దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేయగా మైత్రి మేకర్స్ మొత్తం 4 రోజులకు రెండున్నర కోట్లతో డీల్ సెట్ చేశారట.

ఐతే డేవిడ్ వార్నర్ తెలుగు తెర మీద కనిపించడం సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. నితిన్ రాబిన్ హుడ్ కి డేవిడ్ వార్నర్ క్యామియో నిజంగానే అదిరిపోతుందని అంటున్నారు. ఇంతకీ వెంకీ కుడుముల డేవిడ్ వార్నర్ ని ఎలా వాడుకున్నాడు. సినిమాలో అతని రోల్ ఎలా ఉంటుంది అన్నది నెక్స్ట్ వీక్ సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.

ఇక రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్స్ జోరందుకోగా నితిన్ ఫ్యాన్స్ సినిమాపై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఛలో, భీష్మ సినిమాలతో హిట్ అందుకున్న వెంకీ కుడుముల రాబిన్ హుడ్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి అది సాధ్యమైందా లేదా అన్నది సినిమా వస్తేనే తెలుస్తుంది. నితిన్ శ్రీలీల కలిసి నటించిన ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ సినిమా వర్క్ అవుట్ కాలేదు కానీ ఈ సినిమా మాత్రం తప్పకుండా సక్సెస్ సాధిస్తుందని నమ్ముతున్నారు.

Tags:    

Similar News