మహేష్ బాబు.. బిజినెస్ లో రిస్కు లేని హీరో!

ముఖ్యంగా హీరోల రెమ్యునరేషన్ అనేది బిగ్ పాయింట్. ఇలాంటి పరిస్థితుల్లో స్టార్ హీరోలపై పెట్టుబడి పెట్టే విషయంలో నిర్మాతలు ముందడుగు వేయడమే కష్టంగా మారింది.;

Update: 2025-03-21 06:05 GMT
మహేష్ బాబు.. బిజినెస్ లో రిస్కు లేని హీరో!

ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా విజయాలతో హీరోల రెమ్యునరేషన్ ఊహించని రేంజ్ లో పెరిగిపోయింది. ఒకప్పుడు 100 కోట్ల బడ్జెట్ ఉంటే అది పెద్ద సినిమా అనిపించేది. కానీ ఇప్పుడు స్టార్ హీరోల రెమ్యూనరేషన్‌ 100 కోట్లు దాటేసింది. ఇక సినిమాకు మొత్తం బడ్జెట్ 300 కోట్లకు చేరుతోంది. దీంతో థియేట్రికల్ రేట్స్, ఓటీటీ హక్కుల వల్ల నిర్మాతలు మిగతా ఖర్చులు బ్యాలెన్స్ చేసుకోవడంలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సినిమాను సేఫ్ జోన్‌లో పెట్టడం నిర్మాతల దగ్గర పెద్ద పరీక్షగా మారిపోయింది.

ముఖ్యంగా హీరోల రెమ్యునరేషన్ అనేది బిగ్ పాయింట్. ఇలాంటి పరిస్థితుల్లో స్టార్ హీరోలపై పెట్టుబడి పెట్టే విషయంలో నిర్మాతలు ముందడుగు వేయడమే కష్టంగా మారింది. ముఖ్యంగా ఒక్క సినిమా ఫెయిల్ అయితే ఉహించని దెబ్బ పడుతోంది. ఈ పరిస్థితుల్ని గమనించిన మహేష్ బాబు ముందే ఒక స్మార్ట్ నిర్ణయం తీసుకున్న విధానం ఇప్పుడు చాలామందికి ఒక ప్రేరణగా నిలుస్తోంది. గత కొన్ని సినిమాలుగా ఆయన రెమ్యునరేషన్‌ అనే ఓ ఫిక్స్‌డ్ అమౌంట్ తీసుకోకుండా, ప్రాఫిట్‌షేరింగ్‌ మోడల్‌ను ఫాలో అవుతున్నారని సమాచారం.

మహేష్ GMB ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌ను ప్రారంభించిన తర్వాత తన సినిమాల్లో కో-ప్రొడ్యూసర్‌గా కూడా మారిపోయాడు. ఇలా చేస్తూ ఒకవైపు నిర్మాతగా, మరోవైపు హీరోగా ప్రాఫిట్‌లో ఓ షేర్ తీసుకునేలా డీల్‌ ఫిక్స్ చేసుకుంటున్నాడు. నిర్మాతకు ముందుగా నష్టం రాకుండా చూసుకుంటూ, సినిమా విజయవంతమైతే తనకూ లాభం వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్న మహేష్ బిజినెస్ మైండ్ ఇండస్ట్రీలో మిగతా స్టార్ హీరోలకు ఉదాహరణగా మారింది.

ఇప్పుడు మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న SSMB29 మూవీకి కూడా ఇదే మోడల్‌ను ఫాలో అవుతున్నారని సమాచారం. ఈ పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీకి దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నారని టాక్. అయితే ఇంత పెద్ద బడ్జెట్ పెట్టడాన్ని ప్రోత్సహిస్తూ, మహేష్ రెమ్యూనరేషన్‌గా ఫైనల్ ప్రాఫిట్లో 35% వాటా తీసుకుంటున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సినిమా నష్టం అయితే జీరో రెమ్యూనరేషన్‌ తీసుకుంటానన్న క్లారిటీతో నిర్మాతలపై భారం పడకుండా డీల్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇలాంటి డీల్‌లు భవిష్యత్‌లో ఇండస్ట్రీకి ఎంతో అవసరం. నిర్మాతలు భయపడకుండా పెద్ద సినిమాలు ట్రై చేయాలంటే, హీరోలు ఈ తరహా ఒప్పందాల వైపు మొగ్గు చూపాల్సిందే. మహేష్ బాబు సెట్ చేసిన ఈ ట్రెండ్ త్వరలోనే టాలీవుడ్‌లో మిగతా స్టార్ హీరోలు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. టాలీవుడ్ లాంగ్ టర్మ్ ఆరోగ్యానికి ఇది మంచి పరిణామంగా చూడవచ్చు.

Tags:    

Similar News