సమ్మర్ హీట్ పెంచేస్తున్న ఈ బ్యూటీని చూసారా?
వేసవి తాపం అంతకంతకు పెరుగుతోంది. ప్రతి సంవత్సరం భూమిపై 4 డిగ్రీల అదనపు ఉష్ణోగ్రత పెరుగుతోందని ఆందోళనకర రిపోర్టులు అందుతున్నాయి.;

వేసవి తాపం అంతకంతకు పెరుగుతోంది. ప్రతి సంవత్సరం భూమిపై 4 డిగ్రీల అదనపు ఉష్ణోగ్రత పెరుగుతోందని ఆందోళనకర రిపోర్టులు అందుతున్నాయి. భారతదేశంలో 40డిగ్రీల నుంచి 50 డిగ్రీల సెల్సియస్ కి ఉష్ణోగ్రత పెరుగుతోందనే భయాందోళనలు ఉన్నాయి.

అయితే ఈ పరిస్థితి రావడానికి ముందే, సమ్మర్ ని మరిగిస్తోంది బాలీవుడ్ బ్యూటీ సోనమ్ బజ్వా. సోషల్ మీడియాల్లో నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో మంటలు పెట్టే ఈ బ్యూటీ ఈ వేసవిని స్పెషల్ లుక్ తో మరిగించింది. బ్రాలెట్ - బ్యాగీ డెనిమ్‌లలో సోనమ్ బజ్వా ఉబెర్ కూల్ స్టైల్ గుబులు రేపుతోంది.

సోనమ్ బజ్వా అందరి దృష్టిని ఆకర్షించడం ఇప్పుడే కొత్తేమీ కాదు. చిట్టి పొట్టి గౌన్ లతో కుర్రకారు గుండె గిల్లడంలో, పొట్టి నిక్కర్లు బికినీల్లో వేడెక్కించడంలోను ఈ అమ్మడు ఎప్పుడూ స్పీడ్ గా ఉంటుంది. ప్రస్తుతం వేసవి కోసం స్పెషల్ లుక్స్ తో చెలరేగిపోతోంది. తాజాగా రిలీజ్ చేసిన బ్లాక్ అండ్ వైట్ చిక్ సమ్మర్ లుక్ వైరల్ గా మారుతోంది. సమ్మర్ స్టైల్ ని ఎలివేట్ చేస్తూ క్లాసిక్ డెనిమ్ లుక్ లో బజ్వా అద్భుతంగా కనిపిస్తోంది. తెల్లటి బ్యాగీ షర్ట్, మోనోక్రోమ్ బ్రాలెట్‌ను ఈ భామ ధరించింది. బ్యాగీ డెనిమ్‌లో సోనమ్ బజ్వా కూల్ గర్ల్ స్టైల్ హీట్‌ను మరింత పెంచేస్తోందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
పంజాబీ పరిశ్రమ నుంచి బాలీవుడ్ కి వచ్చిన సోనమ్ బజ్వా తదుపరి `సనమ్ తేరి కసమ్` ఫేం హర్షవర్ధన్ రాణే సరసన నటించనుంది. `హౌస్‌ఫుల్ 5`లోను బజ్వా నటిస్తోంది. ఇప్పటికే తన పాత్ర షూటింగ్ పూర్తి చేసింది. ఇప్పుడు హర్షవర్ధన్ రాణే రొమాంటిక్ చిత్రం `దీవానియాత్`లో నటించడానికి సిద్ధంగా ఉంది. ఇది ఒక ఉద్వేగభరితమైన ప్రేమకథ. దీనికి మిలాప్ జవేరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ, బ్రేకప్, మ్యూజిక్ ఇవన్నీ ఈ సినిమాను మరో స్థాయికి చేరుస్తాయని మిలాప్ నమ్ముతున్నారు.