హాస్పిటల్ లో మాళవిక.. అసలేమైంది?
సాధారణంగా మాళవిక సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు, రెగ్యులర్ అప్డేట్స్ ను షేర్ చేస్తూ తన ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది.;

మాళవిక శర్మ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రవితేజతో నేల టికెట్, రామ్ పోతినేని హీరోగా రెడ్, గోపీచంద్ తో భీమా, సుధీర్ బాబుతో కలిసి హరోంహర సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన మాళవిక శర్మ ఇప్పుడు తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసి అందరినీ షాకయ్యేలా చేసింది.

సాధారణంగా మాళవిక సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు, రెగ్యులర్ అప్డేట్స్ ను షేర్ చేస్తూ తన ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. కానీ ఇప్పుడు మాళవిక సడెన్ గా హాస్పిటల్ లో కనిపించింది అది కూడా హాస్పిటల్ డ్రెస్ లో. ఎప్పుడూ గ్లామరస్ ఫోటోలు షేర్ చేసే మాళవిక సడెన్ గా ఈ వీడియో షేర్ చేయడంతో ఆమె ఫాలోవర్లు ఆందోళన చెందుతున్నారు.
అయితే ఆ వీడియోను షేర్ చేస్తూ మాళవిక ఓ క్యాప్షన్ ను కూడా రాసుకొచ్చింది. నవ్వండి, ఎందుకంటే అనుకోకుండా హాస్పిటల్ డ్రెస్ లో ఇరుక్కునిపోయి, చుట్టూ ఏవేవో మిషన్స్ ఉన్నప్పుడు అంతకంటే ఏం చేస్తాం? అయినా ఈ డ్రెస్ లో కూడా అందంగా కనిపిస్తున్నాంటూ షేర్ చేసింది. అయితే ఈ విషయాన్ని మాళవిక లైట్ తీసుకుంటున్నప్పటికీ అసలు విషయం తెలియని ఆమె ఫాలోవర్లు మాత్రం ఆశ్చర్యపోతున్నారు.
అంతేకాదు, అందరూ ప్రశాంతంగా ఉండటానికి చిల్ అవుతూ ఉంటారు కానీ హాస్పిటల్ అడ్వెంచర్ కు మాత్రం ఎవరూ రెడీగా లేరంటూ ఆమె క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇదంతా పక్కన పెడితే అసలు మాళవిక హాస్పిటల్ కు వెళ్లడం వెనుక ఉన్న కారణమేంటనేది ఇప్పుడు అందరినీ కంగారు పెడుతుంది. మాళవిక నార్మల్ చెకప్ కోసమే వెళ్లిందా లేదా ఇంకేమైనా సమస్యతో హాస్పిటల్ లో అడ్మిట్ అయిందా అనే విషయాన్ని ఆమె క్లారిటీ ఇస్తే తప్ప తెలియదు. మరి తన ఫాలోవర్లను దృష్టిలో పెట్టుకుని మాళవిక ఈ విషయంలో స్పష్టత ఇస్తుందేమో చూడాలి.