విధ్వంసానికి ముందు.. రిలాక్స్ మోడ్ లో నాని!

ఇన్ని రోజులుగా గ్యాప్ లేకుండా షూటింగ్‌లు చేసుకుంటూ తిరిగిన నాని, ఇప్పుడు ఒక గుడ్ బ్రేక్ తీసుకుంటున్నాడు.;

Update: 2025-03-21 06:41 GMT
విధ్వంసానికి ముందు.. రిలాక్స్ మోడ్ లో నాని!

ఒక్కసారి వర్క్‌మోడ్‌లోకి వచ్చాక తిరుగులేని వేగంతో సినిమాలు చేసే నేచురల్ స్టార్ నాని, ఇటీవలి కాలంలో వరుసగా షూటింగులతో బిజీగా గడిపాడు. శ్యామ్ సింగ్ రాయ్, దసరా, హాయ్ నాన్న వంటి విభిన్న సినిమాలతో నటుడిగా తన స్థాయిని పెంచుకున్న నాని, ఒకేసారి నటుడిగా, నిర్మాతగా ఫుల్ స్వింగ్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఆయన నిర్మించిన ‘కోర్ట్’ అనే చిన్న సినిమా సంచలన విజయం సాధిస్తోంది. ఇక హీరోగా నటించిన 'HIT 3' షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

ఇతర చిత్రాల విషయానికి వస్తే.. 'దసరా'తో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ ఓదెలతో కలిసి నాని 'ది ప్యారడైజ్' అనే రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా ప్లాన్ చేశాడు. కానీ వివిధ కారణాలతో ఈ సినిమా కొంత ఆలస్యమైంది. మళ్లీ టైమ్ వేస్ట్ కాకుండా మరో ప్రాజెక్ట్ లైన్‌లో పెట్టేందుకు ట్రై చేశాడు. అందుకోసం తమిళ దర్శకుడు సిబి చక్రవర్తితో చర్చలు జరిపాడు. కానీ అది వర్కవుట్ కాలేదు.

అదే సమయంలో సుజిత్ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమా తర్వాత సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇన్ని రోజులుగా గ్యాప్ లేకుండా షూటింగ్‌లు చేసుకుంటూ తిరిగిన నాని, ఇప్పుడు ఒక గుడ్ బ్రేక్ తీసుకుంటున్నాడు. వచ్చే సినిమాల్లో మరింత హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉన్నందున, ఈ సమ్మర్‌ను పూర్తిగా కుటుంబంతో గడిపేందుకు ప్లాన్ చేశాడు.

విదేశీ ట్రిప్‌కి వెళ్లి కుటుంబ సభ్యులతో సమయం గడిపి మళ్లీ రెఫ్రెష్ అయి తిరిగి వస్తాడని తెలుస్తోంది. ఇదే సమయంలో తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌లో కొత్త ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టేందుకు కూడా ఈ గ్యాప్‌ని వినియోగించనున్నాడు. ‘ది ప్యారడైజ్’ సినిమా వేసవి తర్వాత రెగ్యులర్ షూట్‌లోకి వెళ్లనుంది. మరోవైపు, ‘HIT 3’ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో యాక్షన్ డోస్ కూడా ఎక్కువగా ఉండనుందని సమాచారం.

నాని ఇప్పటివరకు చేసిన పాత్రలతో పోల్చితే.. HIT యూనివర్స్‌లో అతని క్యారెక్టర్ మరింత డార్క్‌గా, ఇంటెన్స్‌గా ఉండనుందని ఇండస్ట్రీలో టాక్. ఈ మూవీ కూడా ఆయన కెరీర్‌లో మరో అంచుకు తీసుకెళ్తుందనే అంచనాలున్నాయి. మొత్తానికి.. వరుసగా భిన్నమైన పాత్రలు చేస్తూ, నటుడిగా ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించాలనే తపనలో ఉన్న నాని, ఈసారి తన మైండ్ అండ్ బాడీకి అవసరమైన రెస్ట్ తీసుకుంటూ, మళ్లీ ఫుల్ ఎనర్జీతో తెరపై తిరిగిరావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ గ్యాప్ తర్వాత ఆయన నుంచి మరిన్ని పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌లు రావడం ఖాయం.

Tags:    

Similar News