వైరల్‌ వీడియో : డేవిడ్‌ వార్నర్‌, కేతిక సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌

అంతే కాకుండా సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.;

Update: 2025-03-26 12:26 GMT
వైరల్‌ వీడియో : డేవిడ్‌ వార్నర్‌, కేతిక సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌

డేవిడ్‌ ఆండ్రూ వార్నర్‌ ఆస్ట్రేలియన్‌ జాతీయ జట్టు మాజీ కెప్టెన్‌. ఇతడు ఐపీఎల్‌ ద్వారా ఇండియన్ క్రికెటర్స్‌కి మరింత చేరువ అయ్యాడు. కరోనా సమయంలో ఇతడు చేసిన రీల్స్‌తో అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. ముఖ్యంగా తెలుగు హీరోలకు సంబంధించిన ఫేమస్ డైలాగ్స్‌ను, హుక్ మూమెంట్స్‌ను రీల్స్‌గా చేయడం ద్వారా వైరల్‌ అయ్యాడు. టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖ హీరోల పాత్రలను రీ క్రియేట్‌ చేసిన డేవిడ్‌ వార్నర్‌ తెలుగు నెటిజన్స్‌కి సుపరిచితుడు అయ్యాడు. అంతే కాకుండా సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. డేవిడ్‌ వార్నర్‌కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆయన్ను సినిమాల్లోకి తీసుకు వచ్చారు.

నితిన్‌ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన 'రాబిన్‌ హుడ్‌' సినిమాతో నటుడిగా డేవిడ్ వార్నర్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రాబిన్‌హుడ్‌ సినిమాలో గెస్ట్‌ రోల్‌లో వార్నర్ కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే సినిమాలోని ఆయన లుక్‌ను రివీల్‌ చేశారు. హెలికాప్టర్‌ షాట్స్‌తో వార్నర్‌ అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. కచ్చితంగా ఈ సినిమా తర్వాత వార్నర్ నటుడిగా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్‌ వినిపిస్తుంది. మార్చి 28న విడుదల కాబోతున్న రాబిన్‌హుడ్‌ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వార్నర్‌ పాల్గొన్నాడు. ఆ ఈవెంట్‌లో హీరోయిన్స్ శ్రీలీల, కేతిక శర్మలతో డాన్స్ చేసిన విషయం తెల్సిందే.

రాబిన్‌హుడ్‌ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో వార్నర్‌ను తెగ వాడేసుకుంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వార్నర్ చేసిన హడావిడి వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఒక వీడియో కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వార్నర్‌ మావ ఇది మేము చూడలేదు, ఇది ఎలా మిస్‌ అయ్యాం అంటూ సరదాగా కామెంట్స్ చేస్తూ ఈ వీడియోను తెగ షేర్‌ చేస్తున్నారు. మీమర్స్‌ ఈ వీడియోను ఓ రేంజ్‌లో వాడేసుకుంటున్నారు. వార్నర్‌, కేతిక మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ అంటూ ప్రచారం చేస్తున్నారు. డేవిడ్‌ వార్నర్‌ ఫ్యాన్స్‌ సైతం సరదాగా ఈ వీడియోలను షేర్‌ చేస్తున్నారు.

వీడియోలో కేతిక తలపై కాగితాలు పడితే వార్నర్‌ వాటిని తొలగిస్తూ ఉన్నాడు, అలాగే వార్నర్‌ పై ఉన్న కాగితాలను కేతిక తొలగిస్తూ ఉంది. పది సెకన్లు కూడా లేని ఈ వీడియోను సోషల్‌ మీడియాలో ప్రముఖంగా షేర్‌ చేస్తున్నారు. వార్నర్‌ వంటి అంతర్జాతీయ సెలబ్రెటీ కి సంబంధించిన ఇలాంటి వీడియోలు దొరికితే మీమర్స్ వదులుతారా... ఇప్పటికే వార్నర్‌ను మీమ్‌ మెటీరియల్‌గా వాడేస్తున్నారు. ఈ వీడియోను మరింత వైరల్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. ముగ్గురు పిల్లల తండ్రి అయిన డేవిడ్‌ వార్నర్‌ కి కేతిక మీద ఎలాంటి ఫీల్‌ ఉండక పోవచ్చు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం సమ్‌థింగ్‌ అంటూ సరదాగా పోస్ట్‌లు చేస్తున్నారు. వార్నర్‌ ఈ వీడియోపై ఎలా స్పందిస్తాడా అనేది చూడాలి.

Tags:    

Similar News