ఎవరికీ నా సమస్యను చెప్పాలనుకోలేదు: దీపికా
తాను ఒకానొక టైమ్ లో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్టు బాలీవుడ్ నటి దీపికి పదుకొణె బయటపెట్టింది.;
ఒకప్పుడు తమకు ఎలాంటి వ్యక్తిగత సమస్యలున్నా, ఆరోగ్య సమస్యలున్నా సెలబ్రిటీలు బయటపెట్టే వారు కాదు. కానీ సోషల్ మీడియా వచ్చాక ప్రతీ ఒక్కరూ ఎంతో ఓపెన్ గా ఉంటూ ప్రతీదీ షేర్ చేసుకుంటున్నారు. తమ ఇబ్బందుల గురించి, తమ సమస్యల గురించి అందరితో షేర్ చేసుకుంటూ మానసిక ప్రశాంతత పొందుతున్నారు.
తాను ఒకానొక టైమ్ లో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్టు బాలీవుడ్ నటి దీపికి పదుకొణె బయటపెట్టింది. 2014లో కెరీర్లో పీక్స్ లో ఉన్నప్పుడే తాను ఈ ఇబ్బంది పడినట్టు దీపక తెలిపింది. ఆ టైమ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న తనకు ఓ రోజు బాగా అలసటగా అనిపించి కళ్లు తిరిగి పడిపోయినట్టు చెప్పిన దీపికా మొదట్లో వర్క్ స్ట్రెస్ వల్ల అలా అవుతుందనుకుందట.
కానీ స్కానింగ్ చేయించుకున్న తర్వాత తన సిట్యుయేషన్ అందరిలా లేదని అర్థమైందని, ఆ టైమ్ లో తనకేదో అయిపోతున్నట్టు భయపడేదాన్నని, అనవసరమైన విషయాలకు కూడా విపరీతంగా ఏడ్చేదానన్ని చెప్తోంది. ఆఖరికి తన తల్లి సూచన మేరకు థెరపిస్ట్ ను కలిసి తాను మానసిక ఒత్తిడికి లోనైన విషయాన్ని తెలుసుకున్నట్టు దీపిక వెల్లడించింది.
అయితే ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా కావాలనే సీక్రెట్ గా ఉంచాలనుకున్నట్టు దీపిక చెప్పింది. అందుకే ట్రీట్‌మెంట్ గురించి కూడా ఎవరికీ తెలియదని, ఆ సమస్య నుంచి బయటపడుతున్న టైమ్ లోనే తాను మెంటల్ హెల్త్ గురించి అందరికీ చెప్పి, తనకు వచ్చిన ప్రాబ్లమ్ ను అందరితో షేర్ చేసుకున్నట్టు దీపికా చెప్తోంది.
అందులో భాగంగానే దీపికా లివ్ లాఫ్ ఫన్ తో ఒక ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి మెంటల్ హెల్త్ పై అవగాహన కల్పిస్తూ దానిపై వర్క్ చేస్తుంది. ఆ టైమ్ లో దీపిక ఎంతో ఇబ్బందిని ఎదుర్కొంది కాబట్టే తన సమస్య మరొకరికి రాకూడదనే ఉద్దేశంతో దీపిక ఈ ఫౌండేషన్ ను మొదలుపెట్టింది. ఇక దీపిక కెరీర్ విషయానికొస్తే కల్కి2 సినిమా చేయాల్సి ఉంది. కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన కథలు వింటున్నప్పటికీ దీపిక వేటినీ ఫైనల్ చేయలేదు.