దీపికా పదుకొనె ఎనదర్ టాలీవుడ్ ఛాన్స్..?

సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు దీపికా భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్ గా అందుకున్నట్టు తెలుస్తుంది

Update: 2024-02-23 02:30 GMT

బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె సౌత్ సినిమాల మీద ఆసక్తి చూపిస్తుంది. అంతకుముందు ఒకటి రెండు సార్లు తెలుగు సినిమాల్లో ఆఫర్లు వచ్చినా కాదన్న అమ్మడు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో టాలీవుడ్ ప్రభావం చూసి అవకాశం రాగానే ఓకే అనేస్తుంది. ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి సినిమాలో దీపిక పదుకొనె ఫిమేల్ లీడ్ గా నటిస్తుంది. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కే ఈ సినిమాకు అదే రేంజ్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ కావాలని దీపికని ఫిక్స్ చేశారు.

సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు దీపికా భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్ గా అందుకున్నట్టు తెలుస్తుంది. కల్కి తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న అమ్మడికి మరో తెలుగు సినిమా ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. తెలుగులో ఒక్క సినిమా చేస్తే చాలు ఆఫర్లు క్యూ కడతాయి. దీపిక లాంటి క్రేజ్ ఉన్న హీరోయిన్ కోసం అయితే దర్శక నిర్మాతలు మరింత ఆసక్తి చూపిస్తారు. దీపిక పదుకొనె కూడా ఇన్నాళ్లు బాలీవుడ్ లో చేసింది చాలు సౌత్ సినిమాలతో కూడా అలరిద్దామని ఫిక్స్ అయ్యింది.

అదీగాక సాటి హీరోయిన్స్ అంతా కూడా సౌత్ సినిమాలతో ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి దీపికా కూడా సౌత్ సినిమాల్లో ముఖ్యంగా తెలుగు సినిమాలపై ఆసక్తి చూపిస్తుంది. కల్కి లో దీపిక నటిస్తుందని తెలుసుకున్న తెలుగు మేకర్స్ ఆమెను మరో స్టార్ కాంబోలో ఫిక్స్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారట. స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న ఒక సినిమాలో దీపిక పదుకొనెని హీరోయిన్ గా తీసుకోవాలని చర్చలు జరుపుతున్నారట.

దాదాపు అమ్మడు సినిమాకు ఓకే అయినట్టే అని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా కోసం కూడా దీపిక బ్లాస్టింగ్ రెమ్యునరేషన్ అందుకుంటుందని తెలుస్తుంది. కల్కి రిలీజ్ కాకుండానే దీపిక ఖాతాలో మరో క్రేజీ సినిమా వచ్చి చేరిందని తెలుస్తుంది. త్వరలోనే ఆ సినిమా అనౌన్స్ మెంట్ చేస్తారని టాక్. ఇప్పటికే బాలీవుడ్ నుంచి అలియా భట్, కియరా అద్వాని, జాన్వి కపూర్, దిశా పటాని తెలుగులో సినిమాలు చేస్తుండగా వారి దారిలోనే దీపికా పదుకొనె కూడా వరుస తెలుగు ప్రాజెక్ట్ లకు సైన్ చేస్తుందని తెలుస్తుంది. ఇదే దూకుడు చూపిస్తే బాలీవుడ్ లో స్టార్ గా ఉన్న అమ్మడు టాలీవుడ్ లో కూడా టాప్ ప్లేస్ దక్కించుకునే ఛాన్స్ ఉంటుంది.

Tags:    

Similar News