'దేవర' హిందీ ఓపెనింగ్స్ రికార్డ్ మిస్!
ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ల 'దేవర' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ల 'దేవర' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. రెండు వారాలుగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ తో పాటు మొత్తం యూనిట్ సభ్యులు దేశ వ్యాప్తంగా సినిమాకు క్రేజ్ దక్కేందుకు సాధ్యం అయినంత వరకు పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ముంబైలో సినిమా కోసం యూనిట్ సభ్యులు చాలా సమయం కేటాయించింది. అక్కడ అనేక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు, సినిమా ప్రమోషన్స్ కోసం పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు.
ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాలకు బాలీవుడ్ లో మంచి ఆధరణ ఉంటుంది. కనుక దేవర సినిమా కి హిందీ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. చాలా మంది ప్రేక్షకులు దేవర సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే అక్కడ అడ్వాన్స్ బుకింగ్ ఆలస్యం అవ్వడం పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేవర హిందీ వెర్షన్ కు ఇప్పటి వరకు రూ.11 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ నమోదు అయింది. రెండు రోజుల ముందుగానే దేవర హిందీ కి అడ్వాన్స్ బుకింగ్ నమోదు అయి ఉంటే కచ్చితంగా రూ.25 కోట్ల ప్రీ సేల్ జరిగే అవకాశం ఉండేది అనే అభిప్రాయంను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.
అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 'దేవర' సినిమాకు 25 కోట్ల వసూళ్లు నమోదు అయి ఉంటే కచ్చితంగా అరుదైన రికార్డ్ నమోదు అయ్యి ఉండేది. లాంగ్ రన్ లో కచ్చితంగా దేవర సినిమా భారీ వసూళ్లు నమోదు చేయడం ఖాయం. కానీ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా దక్కే రికార్డ్ మిస్ అయ్యాం అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం తో ఉన్నారు. ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లు నటించడం వల్ల దేవర సినిమా హిందీ బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం హిందీలో నిర్మాతలు ఓన్ రిలీజ్ కు వెళ్తున్నారు.
రూ.50 కోట్ల వరకు ఇచ్చేందుకు హిందీ నిర్మాతలు ముందుకు వచ్చినా దేవర సినిమాను ఓన్ రిలీజ్ కి ప్లాన్ చేశారు. హిందీలో ఓన్ రిలీజ్ అనేది కచ్చితంగా సాహస నిర్ణయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కానీ సినిమా పై ఉన్న అంచనాలు, ఆసక్తి నేపథ్యంలో నిర్మాతలు నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సినిమా ను హిందీలో ఓన్ గా రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యారు. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. దేవర సినిమా కు అనిరుధ్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.