దేవర ట్రైలర్ రెడీ.. టైమ్ కూడా ఫిక్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న "దేవర" చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను సొంతం చేసుకుంది.

Update: 2024-09-09 09:47 GMT

 కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. చాలా కాలం తరువాత ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం లో కనిపిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు, సినీ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించాడు. విడుదలైన మూడు పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. పాటలకు వచ్చిన సూపర్ రెస్పాన్స్ తో చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పుడు, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా, సెప్టెంబర్ 10న ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో గ్రాండ్ గా జరగనున్నట్లు తెలుస్తోంది.

ఇక లేటెస్ట్ గా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో ట్రైలర్ ను రేపు సాయంత్రం 5:04 గంటలకు విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ తో పాటు, హీరోయిన్ జాన్వీ కపూర్, విలన్ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీఖాన్ కూడా పాల్గొనబోతున్నారు. అలాగే సినిమాలో నటించిన ఇతర కీలక నటులు, సాంకేతిక నిపుణులు కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ ట్రైలర్ లాంచ్ సందర్భంగా మీడియా సమావేశం కూడా జరుగుతుందనే టాక్ ఉంది.

ట్రైలర్ నిడివి 2 నిమిషాల 45 సెకండ్లు ఉంటుందని, దానిలోని యాక్షన్ సీన్స్, ఎన్టీఆర్ యొక్క పవర్ ప్యాక్ డైలాగ్స్ అభిమానులను ఆశ్చర్యపరచడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఆర్ఆర్ఆర్ వంటి మెగా హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో, "దేవర" పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టాక్ ప్రకారం, ఈ చిత్రం 350-400 కోట్ల మధ్యలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.

దేవర చిత్రానికి నార్త్ అమెరికాలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 15000కి పైగా టికెట్లు వేగంగా అమ్ముడవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరచింది. ఇంత వేగంగా ఏ ఇండియన్ సినిమాకు బుకింగ్స్ జరగలేదు. దీంతో ఈ చిత్రంపై ఉన్న క్రేజ్ ను స్పష్టంగా తెలియజేస్తోంది.

ట్రైలర్ విడుదల తర్వాత ఈ బుకింగ్స్ మరింత వేగంగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజే 100-150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం సినీ ప్రియులు, అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి దేవర ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడలు.

Tags:    

Similar News