విజయ్ దేవరకొండ vs విశ్వక్.. క్లాష్ తప్పదా?

విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మొదట డిసెంబర్ రెండవ వారంలో విడుదల చేయాలని అనుకున్నారు

Update: 2023-11-28 16:33 GMT

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న యువ హీరోలలో చాలా విభిన్నంగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న వారిలో విజయ్ దేవరకొండ విశ్వక్ సేన్ టాప్ లిస్టులో ఉంటారు అని చెప్పవచ్చు. ఈ ఇద్దరు కూడా తరుణ్ భాస్కర్ సినిమాల ద్వారానే హీరోలుగా మంచి గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే.

పెళ్లి చూపులు ఈ నగరానికి ఏమైంది రెండు సినిమాలు కూడా యూత్లో మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. ఇక సినిమా సినిమాకు ఈ ఇద్దరు డిఫరెంట్ క్యారెక్టర్లతో ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక మొదటిసారి ఇద్దరి మధ్యలో బాక్సాఫీస్ వద్ద క్లాష్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకసారి ఆ క్లాష్ ఏంటి అనే వివరాల్లోకి వెళితే..

విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మొదట డిసెంబర్ రెండవ వారంలో విడుదల చేయాలని అనుకున్నారు. పోటీగా హాయ్ నాన్న అలాగే నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ ఉన్నప్పటికీ కూడా విశ్వక్ ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. కానీ కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో దర్శకుడు మరింత సమయం తీసుకున్నాడు. దీంతో సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది.

అయితే సంక్రాంతికి కూడా విడుదల చేయాలని ఆలోచనతో ఉన్నప్పటికీ ఆ ఫెస్టివల్ లో ఇప్పటికే ఆరు సినిమాలు పోటీలు ఉన్నాయి. కాబట్టి అనవసరంగా అప్పుడు రావడం కరెక్ట్ కాదు అని సమ్మర్ కు ఈ సినిమాను షిఫ్ట్ చేసుకున్నారు. మొత్తానికి గ్యాంగ్స్ గోదావరి మార్చి 8న రాబోతున్నట్లు ఇటీవల అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. అయితే అదే సమయంలో విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఒక టాక్ వినిపిస్తుంది.

పరశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పనులు ఆలస్యం కావడంతో మార్చి విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నారు. అంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కాస్త పోటీగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా వేటికమే విభిన్నమైన తరహాలో ఉండబోతున్నాయి. ముఖ్యంగా విశ్వక్ అయితే మాస్ రఫ్ లోక్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కనిపించబోతున్నాడు. ఆ సినిమాపై అంచనాల అయితే గట్టిగానే ఉన్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఈ ఇద్దరు నిజంగానే పోటీ పడతారా లేదా అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News