అభిమానుల‌కు దేవ‌ర అభియ‌హ‌స్తం!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో 'దేవ‌ర' రెండు భాగాలుగా తెర‌కెక్కు తోన్న సంగ‌తి తెలిసిందే

Update: 2024-01-11 11:48 GMT

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో 'దేవ‌ర' రెండు భాగాలుగా తెర‌కెక్కు తోన్న సంగ‌తి తెలిసిందే. సాగ‌ర తీరం- మ‌త్స‌కార నేప‌థ్యంలో సాగే స్టోరీ ఇది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో అంచనాలు ప‌తాక స్థాయికి చేరాయి. రా అండ్ ర‌స్టిక్ కంటెంట్ అని తెలుస్తోంది. మునుపెన్న‌డు చూడ‌ని స‌రికొత్త తార‌క్ ని కొర‌టాల ప్ర‌జెంట్ చేస్తున్నాడు.

దేవ‌ర క్యార‌క్ట‌రైజేష‌న్ డిజైన్ లుక్..ప్ర‌తీది అంత‌కంత‌కు అంచ‌నాలు పెంచేస్తుంది. ఇంత‌వ‌ర‌కూ అంద‌రికీ తెలిసిన క‌థ‌..రోజు వినిపిస్తోన్న వార్త‌. కానీ తెలియ‌ని క‌థ మ‌రొక‌టి ఉంది. ఈ స్టోరీని కొర‌టాల ఎంత బ‌లంగా రాసాడు? అన్న దానికి ఆయ‌నే మాట‌లే సాక్ష్యంగా భావించాలి. ఈ క‌థ‌ని ఎంత బ‌లంగా న‌మ్మి గ్లోబ‌ల్ స్టార్ అయిన త‌ర్వాత తార‌క్ చేస్తున్నాడు? అన‌డానికి ఆయ‌న మాట‌లో మ‌రోసారి సాక్ష్యంగా తీసుకోవాలి.

అవును దేవ‌ర కంటెంట్ ఎలా ఉంటుంది? అన‌డానికి కొర‌టాల చేసిన ఈ వ్యాఖ్య‌లే ఆధారం. దేవ‌ర స్టోరీ ఇలా ఉంటుంది. ఈ క‌థ‌లో మ‌నుషులు కంటే ఎక్కువ మృగాలుంటాయి. భ‌యం తెలియ‌దు..దేవుడంటే భ‌యంలేదు..చావంటే భ‌యంలేదు. ఇలా ఎంతో బ‌ల‌మైన కంటెంట్ తో పాత్ర‌ల్ని కొర‌టాల డిజైన్ చేసిన‌ట్లు స్వ‌యంగా తెలిపారు. ఆ పాత్ర‌ల్ని అందే రేంజ్ లో హైలైట్ చేస్తారు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

కొర‌టాల సెన్సిబుల్ స్టోరీల్ని ఎంత అందంగా..ఆహ్లాదంగా చూపిస్తాడో ఇప్ప‌టివ‌ర‌కూ ప్రేక్ష‌కులు చూసారు. కానీ దేవ‌ర లో మొద‌లు నుంచి ముగింపు వ‌ర‌కూ భారీ యాక్ష‌న్ హైలైట్ అవుతుంది. ఓ కొత్త తార‌క్ ని తెర‌పై చూపించ‌బోతున్నాడు. భ‌యం తెలియ‌ని ఆ మృగాలు కేవ‌లం దేవ‌ర‌కే భ‌య‌ప‌డ‌తాయి? ఆ భ‌యాన్ని ఎలా ప‌రిచ‌యం చేస్తాడు? అదే భ‌యంతో ఎలా అంత మొందిస్తాడు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మ‌లుస్తున్నారు. ఇందులో తార‌క్ పాత్ర నెక్స్ట్ లెవ‌ల్లో ఉంటుంద‌ని తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ త‌ర్వాత ప‌ర్పెక్ట్ స్టోరీతో తార‌క్ అభిమానుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్నాడ‌ని కొర‌టాల మాట‌ల్ని బ‌ట్టి తెలుస్తుంది.

Tags:    

Similar News