దేవర ఓవర్సీస్ డీల్ ఎంతంటే..

యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం దేవర.

Update: 2024-01-27 05:23 GMT

యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం దేవర. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఎన్ఠీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ దేవర మూవీతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెడుతోంది. ఆమె కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఇదే కావడం విశేషం.

ఈ సినిమాతో స్టార్ ఇమేజ్ వస్తుందని జాన్వీ కపూర్ భావిస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నుంచి రాబోయే సినిమా కావడంతో అంచనాలు పీక్ లో ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ కూడా ఆకట్టుకుంది. దీంతో మూవీపైన భారీ ఎత్తున బిజినెస్ జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాలకి సంబందించిన రిలీజ్ రైట్స్ పై చర్చలు జరుగుతున్నాయి.

ఇప్పుడు ఓవర్సీస్ రైట్స్ డీల్స్ క్లోజ్ అయినట్లు తెల;తెలుస్తోంది. ఈ సినిమాని ఓవర్సీస్ లో హంసినీ ఎంటర్టైన్మెంట్స్ వారు సొంతం చేసుకున్నారంట. ఏకంగా 27 కోట్లు పెట్టి డీల్ సెట్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్ఠీఆర్ కెరియర్ లోనే ఇది చాలా పెద్ద మొత్తం అని చెప్పాలి. ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ రావాలంటే ఏకంగా 5.5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.

ఆర్ఆర్ఆర్ కంటే ముందు తారక్ హైయెస్ట్ ఓవర్సీస్ కలెక్షన్స్ 2 మిలియన్ డాలర్స్ వరకు ఉంది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్ఠీఆర్ ఇమేజ్ గ్లోబల్ లెవల్ కి వెళ్ళింది. ఈ నేపథ్యంలో 5.5 మిలియన్ డాలర్స్ టార్గెట్ అందుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదనే మాట వినిపిస్తోంది. తాజాగా హనుమాన్ మూవీ ఓవర్సీస్ లో 5.5 మిళియన్స్ కి పైగా కలెక్షన్స్ ని రాబట్టింది.

దీంతో తారక్ ఇమేజ్ కి ఆ కలెక్షన్స్ పెద్ద లెక్క కాదని ఆయన అభిమానులు అంటున్నారు. అయితే బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడం సాధ్యం అవుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఏప్రిల్ 5న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వనున్న నేపథ్యంలో ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుంది అనేది చూడాలి.





Tags:    

Similar News