'దేవర' జూలై అప్‌డేట్ వచ్చేసింది!
ఆ క్రేజ్ ను బ్యాలెన్స్ చేస్తూ దేవర సినిమా ను దర్శకుడు కొటాల శివ రూపొందిస్తున్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు తెలుగు మరియు ఇతర భాషల సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా ఎన్టీఆర్ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.
ఆ క్రేజ్ ను బ్యాలెన్స్ చేస్తూ దేవర సినిమా ను దర్శకుడు కొటాల శివ రూపొందిస్తున్నాడు. అందుకే కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమాను అక్టోబర్ లో విడుదల చేయాలని భావించినప్పటికి అంతకంటే ముందే దేవర వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారికంగా ప్రకటన వచ్చింది.
రెండు పార్ట్ లుగా విడుదల అవ్వబోతున్న దేవర సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. దేవర 1 కి సంబంధించిన కీలక షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతోంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్, శ్రీకాంత్ తో పాటు కీలక నటీనటులు ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు అంటూ చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది.
ఈ షెడ్యూల్ ను పూర్తి చేసిన తర్వాత ఎన్టీఆర్ - జాన్వీ కపూర్ లతో ఫారిన్ లొకేషన్స్ లో పాటల చిత్రీకరణ చేస్తారట. దాంతో దేవర పార్ట్ 1 షూటింగ్ పూర్తి అవ్వబోతుంది. ఆగస్టు మొదటి లేదా రెండో వారంకు దేవర 1 కి సంబంధించిన షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టే విధంగా దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేశాడు.
జులై నెలలో షూటింగ్ పూర్తి చేయాలని భావించినా కూడా సాధ్యం కావడం లేదని, ఒకటి లేదా రెండు వారాలు అదనంగా సినిమా కు డేట్లు కేటాయించాల్సి వస్తుంది అంటూ మేకర్స్ సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చారట. ఈసారి డేట్ విషయంలో తగ్గేదే లేదు అన్నట్లుగా హీరో మరియు దర్శకుడు ఉన్నాడు. కనుక జులై అప్డేట్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది.