రివ్యూ : దూత (వెబ్ సీరీస్)
నటీనటులు : నాగ చైతన్య, పార్వతి తిరువొతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, పశుపతి, రవీంద్ర విజయ్, తరుణ్ భాస్కర్, రోహిణి, తనికెళ్ల భరణి, ఈశ్వరి రావు తదితరులు.
సంగీతం : ఇషాన్ చాబ్రా
సినిమాటోగ్రఫీ : మికోలాజ్ సైగులా
నిర్మాత : శరత్ మరార్
దర్శకుడు : విక్రమ్ కె కుమార్
నాగ చైతన్యతో మనం, థాంక్యూ సినిమాలు చేసిన విక్రమ్ కె కుమార్ ఈసారి దూత అనే వెబ్ సీరీస్ చేశారు. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ వెబ్ సీరీస్ లో ప్రియా భవాని శంకర్, పార్వతి తిరువొతు, ప్రాచి దేశాయ్ లీడ్ రోల్స్ లో నటించారు. అమేజాన్ ప్రైమ్ లో రిలీజైన ఈ వెబ్ సీరీస్ ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
సక్సెస్ ఫుల్ జర్నలిస్టు అయిన సాగర్ వర్మ సమాచార్ అనే పేపర్ కి కొత్త సీ.ఈ.ఓగా చేరతాడు. రాజకీయ నాయకులకు సపోర్ట్ గా ఉంటూ వారి నుంచి లాభం పొందుతుంటాడు సాగర్ వర్మ. అయితే సడెన్ గా అతని లైఫ్ లో కొన్ని అనుకోని సంఘటనలు అతన్ని కష్టాల పాలయ్యేలా చేస్తాయి. తన లైఫ్ లో ఏం జరుగుతుందో అది ముందే పేపర్ లో ప్రింట్ అయ్యి తనకు కనబడుతుంది. తను వెళ్లిన ప్రతి చోట ఏదో ఒక సంఘటన అతన్ని వెటాడుతుంది. ఈ క్రమంలోనే తన కూతురిని కోల్పోతాడు సాగర్ వర్మ. తన లైఫ్ లో జరిగే ఈ పరిణామాలన్నిటికీ కారణం తీసుకోవాలనుకున్న సాగర్ వర్మ ఏం చేశాడు..? తన సమస్యల నుంచి సాగర్ వర్మ ఎలా బయట పడ్డాడు. జర్నలిస్ట్ గా అతను ఏం చేయగలిగాడు అన్నది వెబ్ సీరీస్ కథ.
కథనం - విశ్లేషణ :
విక్రమ్ కె కుమార్ అనగానే ఆడియన్స్ అందరికీ మనం గుర్తుకొస్తుంది. అక్కినేని ఫ్యామిలీకి మర్చిపోలేని సినిమా ఇచ్చాడు ఈ డైరెక్టర్. ఆ ఇష్టంతోనే విక్రం తో కలిసి పనిచేసేందుకు ఎప్పుడు ఆసక్తి చూపిస్తాడు నాగ చైతన్య. అయితే ఈసారి ఈ ఇద్దరి కాంబోలో దూత వెబ్ సీరీస్ వచ్చింది. మామూలుగా సెన్సిటివ్ సినిమాలు చేసే విక్రమ్ కె కుమార్ దూత టీజర్, ట్రైలర్ తో ఆడియన్స్ లో ఆసక్తి కలిగేలా చేశాడు.
విక్రమ్ కె కుమార్ ఫస్ట్ అటెంప్ట్ 13B సినిమా థ్రిల్లర్ జోనర్ లోనే ఉంటుంది. దూత వెబ్ సీరీస్ ను కూడా అదే పంథాలో కొనసాగించాడు విక్రమ్ కె కుమార్. జర్నలిస్ట్ గా తప్పులు చేస్తున్న హీరోకి దూత పేపర్ కటింగ్స్ తో అతన్ని వెంటాడుతూ వేధిస్తుంటుంది. చివరకు అతను ఎలా మారాడు అన్నది సీరీస్ సారాంశం. సీరీస్ మొదలు పెట్టిన విధానం బాగుంది. మధ్యలో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా బాగానే అనిపిస్తుంది. కానీ స్లో నేరేషన్ వల్ల సీరీస్ అంతా కూడా చాలా నెమ్మదిగా సాగుతుందన్న భావన కలుగుతుంది.
ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కొద్దిగా పర్వాలేదు అనిపించినా అవి కూడా రొటీన్ గానే రాసుకున్నాడు దర్శకుడు విక్రమ్ కె కుమార్. ముందు సీరీస్ ని థ్రిల్లర్ జోనర్ లో మొదలు పెట్టి మధ్యలో సూపర్ న్యాచురల్ టచ్ ఇచ్చి ఫైనల్ గా అదొక రివెంజ్ స్టోరీగా ముగించాడు. చివర్లో కథలోని పాత్రలను ఫ్లాష్ బ్యాక్ పాత్రలకు కలిపించిన విధానం బాగుంది.
థ్రిల్లర్ జోనర్ లను ఇష్టపడే వారికి దూత కొద్ది మేరకు మెప్పించినా సీరీస్ చాలా వరకు నత్త నడక నడవడం మాత్రం మేజర్ ఆడియన్స్ కు ఇబ్బంది కలిగిస్తుంది. రాసుకున్న కథకు అనుగుణంగా డిటైల్డ్ కథనం రాసుకున్నా అక్కడక్కడ మాత్రం చాలా స్లో అయ్యిందనే ఆలోచన వస్తుంది.
హీరో పాత్రని ముందు నుంచి నెగిటివ్ గా చూపించే ప్రయత్నం చేశారు. సినిమా అయినా వెబ్ సీరీస్ అయినా కథలోని పాత్రలకు కనెక్ట్ అయితే అది ఆడియన్స్ కు ఎంగేజ్ అవుతుంది. కానీ దూత లో ఆ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. ఆరంభం బాగున్నా ముగింపు నిరుత్సాహపరుస్తుంది. 8 ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ వెబ్ సీరీస్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వారికి నచ్చే అవకాశం ఉంది.
నటీనటులు :
నాగ చైతన్య జర్నలిస్ట్ సాగర్ వర్మ పాత్రలు తన మార్క్ చూపించాడు. అంతకుముందు తను చేసిన పాత్రలకు భిన్నంగా సాగర్ వర్మ పాత్రలో మెప్పించాడు నాగ చైతన్య. సినిమాలో అతని తర్వాత ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ క్రాంతి గా నటించిన పార్వతి బాగా చేసింది. సాగర్ వర్మ పి.ఏ అమృత పాత్రలో నటించిన ప్రాచి దేశాయ్ పాత్ర జస్ట్ ఓకే అనేలా ఉంది. ప్రియా భవాని శంకర్ నాగ చైతన్య వైఫ్ పాత్రలో పర్వాలేదు అనిపించింది. తరుణ్ భాస్కర్, తణికెళ్ల, రవీంద్ర విజయ్, పసుపతి అంతా కూడా ఇచ్చిన పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం :
దూత సీరీస్ సినిమాటోగ్రఫీ బాగుంది. సీరీస్ మేజర్ పార్ట్ అంతా కూడా వర్షంలో ఉంటుంది. కానీ ఆ సీన్స్ బాగా చేయగలిగారు. కథకు తగిన లైటింగ్, కెమెరా వర్క్ ఉంది. మ్యూజిక్ కూడా సీరీస్ కు బాగానే సపోర్ట్ చేసింది. కథ, కథనాల్లో దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఇంకాస్త వర్క్ చేస్తే బాగుండేది. సినిమా స్టార్టింగ్ లో ఉన్నంత గ్రిప్ రాను రాను సడలిపోతుంది. చివరి వరకు వచ్చే సరికి రెగ్యులర్ రివెంజ్ డ్రామాలా అనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా చేసి ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగానే ఉన్నాయి.
బాటం లైన్ : ధూత.. జర్నలిస్ట్ మెసేజ్ బాగుంది కానీ..!