అనిరుధ్ vs దేవి.. రెండు ఆయుధాలు

దీంతో ఎక్కువగా స్టార్ హీరోల చిత్రాలకే 'దేవిశ్రీ ప్రసాద్' మ్యూజిక్ అందిస్తున్నారు.

Update: 2024-10-21 04:48 GMT

టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా అత్యధిక పారితోషికం అందుకున్న వ్యక్తి దేవిశ్రీ ప్రసాద్. గతంలో స్పీడ్ గా సినిమాలు చేసిన దేవిశ్రీప్రసాద్ గత కొన్నేళ్ల నుంచి చాలా తగ్గించేశారు. సెలక్టివ్ గా మూవీస్ చేస్తున్నారు. ‘పుష్ప 1’ తో పాన్ ఇండియా రేంజ్ లో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ సక్సెస్ ని అందుకున్నారు. నేషనల్ అవార్డు కూడా వచ్చింది. దీంతో ఎక్కువగా స్టార్ హీరోల చిత్రాలకే ‘దేవిశ్రీ ప్రసాద్’ మ్యూజిక్ అందిస్తున్నారు.

ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ‘కంగువా’ నవంబర్ 14న థియేటర్స్ లోకి వస్తోంది. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమా 8 భాషలలో రిలీజ్ కాబోతోంది. అలాగే డిసెంబర్ 6న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 రిలీజ్ అవుతోంది. ఈ రెండు సినిమాలు దేవిశ్రీ ప్రసాద్ కి చాలా కీలకంగా మారాయి. ప్రస్తుతం సౌత్ లో అనిరుద్ హవా నడుస్తోంది. తమిళంలో అయితే ఆల్ మోస్ట్ టాప్ స్టార్స్ అందరూ అనిరుద్ చుట్టూ తిరుగుతున్నారు.

తెలుగు దర్శకులు కూడా మెల్లగా అనిరుద్ పైన ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి కారణం కూడా ఉంది. అనిరుద్ కంపోజ్ చేసిన సాంగ్స్ కి నేషనల్ వైడ్ గా హైప్ వస్తోంది. అలాగే సినిమాలకి అతను అందించే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోతుంది. ఈ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తోనే కొన్ని సినిమాలు కమర్షియల్ సక్సెస్ అవుతున్నాయి. జైలర్, దేవర అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. పాన్ ఇండియా బ్రాండ్ తో టాలీవుడ్ హీరోలు అందరూ ఇప్పుడు మూవీస్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా కీలకం. ఈ విషయంలో దేవిశ్రీని తక్కువ చేయడానికి లేదు. అతను కూడా అద్భుతమైన కంపోజర్ అయిన కూడా కెరియర్ స్పీడ్ అప్ అవ్వాలంటే ఇప్పుడు రాబోయే ‘కంగువా’, ‘పుష్ప 2’ సినిమాల బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రశంసలు పొందడమే కాకుండా సూపర్ హిట్స్ అందుకోవాల్సి ఉంటుంది. అప్పుడే కెరియర్ పరంగా కూడా అతనికి అవకాశాలు మళ్ళీ పెరుగుతాయి.

ఈ ఏడాది దేవిశ్రీ విశాల్ ‘రత్నం’ సినిమాకి మ్యూజిక్ అందించారు. ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో అనిరుద్ చేతిలో ఏకంగా డజనుకి పైగా సినిమాలున్నాయి. అతనితో పోటీ పడాలంటే మాత్రం ‘కంగువా’, ‘పుష్ప 2’ లతో దేవిశ్రీ ప్రసాద్ కచ్చితంగా సక్సెస్ కొట్టాల్సిందే.

Tags:    

Similar News