మహేష్ రావాలంటే జక్కన్న పర్మిషన్ కావాలట!

అయితే ఆ సినిమాకు సంబంధించి అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి చిన్న అప్డేట్ కూడా రాలేదు.

Update: 2024-09-13 12:22 GMT

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్ లో మూవీ అనౌన్స్మెంట్ వచ్చిన నాటి నుంచి ప్రాజెక్ట్ పై అటు సినీ ప్రియుల్లో, ఇటు మహేష్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను నిర్వహిస్తున్నారు రాజమౌళి. అయితే ఆ సినిమాకు సంబంధించి అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి చిన్న అప్డేట్ కూడా రాలేదు.

ఇప్పటికే మూవీకి గాను నటీనటులను జక్కన్న ఫిక్స్ చేసేశారని తెలుస్తోంది. రీసెంట్ గా మహేష్ బాబుకు రెండు సార్లు ఫోటో షూట్ జరిపినట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ మొదలుపెట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. అందుకు గాను షూటింగ్ స్పాట్స్ ను ఫిక్స్ చేసేందుకు రాజమౌళి పర్యటిస్తున్నట్లు వినికిడి. కానీ ఏం జరుగుతున్నా.. ప్రాజెక్ట్ కు సంబంధించి ఒక్క విషయం కూడా బయటకు రాకుండా చూసుకుంటున్నారు.

మరోవైపు, మహేష్ బాబు.. రాజమౌళి మూవీ కోసం ఫుల్ మేకోవర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో ఉన్న మహేష్.. తన లుక్స్ తో షాక్ ఇస్తున్నారు. ఇక రీసెంట్ గా న్యూయార్క్ నుంచి మహేష్ హైదరాబాద్ వచ్చారు. అయితే సుధీర్ బాబు అప్ కమింగ్ మూవీ మా నాన్న సూపర్ హీరో టీజర్ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మహేష్ వస్తున్నారా అని అని మీడియా ప్రతినిధులు అడిగారు.

ఆ ప్రశ్నకు సుధీర్ బాబు.. మహేష్ రావాలంటే రాజమౌళి పర్మిషన్ కావాలని చెప్పారు. దీంతో అంతా ఒక్కసారిగా నవ్వారు. ఆ తర్వాత మా బావ సూపర్ స్టార్ అనే మాస్ సినిమా భవిష్యత్ లో తీస్తారా అని అడగ్గా.. మా నాన్న సూపర్ హీరోలో మహేష్ కూడా ఉన్నారని సుధీర్ అన్నారు. ఆ విషయం సినిమా చూసిన తర్వాత మాట్లాడదామని తెలిపారు. వచ్చే నెలలో రిలీజ్ కానున్న మా నాన్న సూపర్ హీరో చిత్రంలో మహేష్ ఉన్నారంటూ చేసిన సుధీర్ కామెంట్స్ ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి.

ఇక మా నాన్న సూపర్ హీరో సినిమా విషయానికొస్తే.. లూజర్ ఫేమ్ డైరెక్టర్ అభిలాష్ కంకర దర్శకత్వం వహించారు. సాయి చంద్, షాయాజీ షిండే, ఆర్న, రాజు సుందరం, శశాంక్, ఆమని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. CAM ఎంటర్టైన్మెంట్ తో కలిసి వి సెల్యులాయిడ్స్ బ్యానర్ నిర్మిస్తోంది. జయ్ క్రిష్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమాతో సుధీర్ బాబు ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News