సీనియర్ నటిని మోసం చేసారా!
అయితే ఈ సినిమాలో నటించినందుకు ఖుష్పూ బాధపడినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడి శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'అన్నాత్తై' అప్పట్లో మంచి విజయం సాధిం చిన సంగతి తెలిసిందే. యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన చిత్రం తమిళ్ లో మంచి వసూళ్లను సాధించింది. తెలుగులో 'పెద్దన్న' టైటిల్ తో రిలీజ్ అయింది. ఇక్కడ మాత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ సినిమాలో ఖుష్బూ , మీనా, నయనతార, కీర్తి సురేష్ ఇతర కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమాలో నటించినందుకు ఖుష్పూ బాధపడినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇప్పటి వకూ నటించిన చిత్రాల్లో ఎక్కువగా బాధపెట్టిన సినిమాలు ఏవైనా ఉన్నాయా? అంటే అందులో బాలీవుడ్ సినిమాల కంటే సౌత్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. 'బాలీవుడ్ లో నటించినవి తక్కువ సినిమాలే. కాబట్టి అక్కడ పెద్దగా సమస్య లేదు. దక్షిణాదికి వస్తే చాలా సినిమాలున్నాయి. నటించిన తర్వాత చాలా బాధపడ్డానన్నారు.
'కొన్నేళ్ల క్రితం రజనీకాంత్ తో ఓ సినిమా చేసాను. ఆ సినిమాలో నేరేషన్ సమయంలో చెప్పిన విధంగా నా పాత్ర తెరపైకి కనిపించలేదన్నారు. అందులో మీనా కూడా నటించింది. కీలక పాత్రలు మావేనని చెప్పారు. అదే విషయం బయట అందరికీ చెప్పాను. ఆయనతో డ్యూయెట్లు ఉంటాయన్నారు. రజనీకాంత్ కి జోడీగా వేరే హీరోయిన్ ఎవరూ ఉండరని నేను అనుకున్నాను.
'అందుకే ఆ సినిమాకి అంగీకరించా. ఆ పాత్ర నాకెంతో నచ్చింది. తీరా సినిమా పట్టాలెక్కే సమయానికి అంతా తారు మారైందన్నా'రు. ఈ సినిమాలో నయనతార పాత్ర అతిధి పాత్రలా ఉందని అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఖుష్బూ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.