SSMB 29: జక్కన్న టార్గెట్ రూ.1000 కోట్లు కాదు.. ఏకంగా..!

ఫస్ట్ పోస్టర్ నుంచి లాస్ట్ సినిమా ఎండ్ కార్డ్ పడే వరకు రాజమౌళి మార్క్ క్లియర్ గా తెలుస్తోంది.

Update: 2025-01-04 14:25 GMT

దర్శకధీరుడు రాజమౌళి.. ఆయన రేంజే వేరు. జక్కన్న మూవీ అంటే చాలు.. ప్రతి విషయంలో పెర్ఫెక్షనిజం కచ్చితంగా కనిపిస్తుంది. ఫస్ట్ పోస్టర్ నుంచి లాస్ట్ సినిమా ఎండ్ కార్డ్ పడే వరకు రాజమౌళి మార్క్ క్లియర్ గా తెలుస్తోంది. అంతటి హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి.. ఎన్నో ఘనతలు అందుకున్నారు. ఖ్యాతి గడించారు.

బాహుబలి సిరీస్ చిత్రాలతోపాటు ఆర్ఆర్ఆర్ మూవీతో తెలుగు సినిమాను ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు మన జక్కన్న. టాలీవుడ్ మూవీకి ఆస్కార్ అవార్డు తీసుకొచ్చారు. వరల్డ్ వైడ్ గా స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. దీంతో తన అప్ కమింగ్ మూవీ SSMB 29 పై అనౌన్స్మెంట్ నుంచే వేరే లెవెల్ బజ్ క్రియేట్ అయిపోయింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్ లో నటిస్తున్న ఆ సినిమా.. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో సాగే అడ్వెంచర్ జర్నీగా తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. రీసెంట్ గా హైదరాబాద్ లో పూజా కార్యక్రమం ఎలాంటి హడావుడి లేకుండా జరగ్గా.. జనవరి లాస్ట్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

రెండు భాగాలుగా SSMB 29 రానుందని.. 2026లో ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో కేఎల్ నారాయణ నిర్మిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాతో రాజమౌళి మరోసారి రూ.1000 కోట్ల క్లబ్ టార్గెట్ ను పెట్టుకున్నారని కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. కానీ జక్కన్న లక్ష్యం అది కాదని అంటున్నారు.

ఎందుకంటే రాజమౌళి.. ఇప్పటికే బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ సినిమాలతో రూ.1000 కోట్ల క్లబ్ లోకి రెండు సార్లు ఎంట్రీ ఇచ్చారు జక్కన్న. సౌత్ నుంచి అడుగుపెట్టిన తొలి డైరెక్టర్ గా ఘనత సాధించారు. దానికి తోడు రాజమౌళి తాను ఏం చేసినా.. అంతా ఒక్కసారిగా షేక్ అయ్యేలా చేయాలని చూస్తుంటారన్న విషయం తెలిసిందే.

దీంతో ఇప్పుడు రాజమౌళి SSMB 29 మూవీతో రూ.3వేల కోట్ల మార్క్ ను అందుకునేలా టార్గెట్ ను పెట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. అలా జరగాలంటే పాన్ వరల్డ్ బెల్ట్ లో భారీ వసూళ్లు రాబట్టాలి. అందుకు తగ్గ ప్రమోషన్స్ నిర్వహించి.. ప్రపంచ దేశాలు తిరిగి అక్కడి ఆయా స్టేట్స్ ఆడియన్స్ ను మూవీకి కనెక్ట్ అయ్యేలా చేయాలి.

అయితే ఇప్పుడు పుష్ప-2: ది రూల్ మూవీ రూ.2 వేల కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతుండగా.. SSMB 29 వచ్చినప్పుడు మరో రెండేళ్లు కచ్చితంగా పడుతుంది. కాబట్టి రూ.3 వేల టార్గెట్ ను ఫిక్స్ చేసుకునే ఎక్కువగా అవకాశం ఉంది. అదే సమయంలో రాజమౌళి తలుచుకుంటే ఏదైనా చేయగలరనే చెప్పాలి. బాహుబలి-2 వసూళ్ల రికార్డు అప్పుడు ఎవరూ గెస్ చేయలేదు. అందుకే ఇప్పుడు SSMB 29 విషయంలో జక్కన్న ఏం చేస్తారో.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News