గేమ్ ఛేంజర్.. దిల్ రాజు కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉందంటే..

అయితే రిలీజ్ దగ్గరపడుతున్న వేళ.. నిర్మాత దిల్ రాజు తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

Update: 2025-01-06 06:08 GMT

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. ఈ ఏడాది సంక్రాంతికి రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదట గేమ్ ఛేంజర్ జనవరి 10వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో యాక్ట్ చేశారు.

ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ తో ప్రస్తుతం మేకర్స్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే సాంగ్స్, టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మూవీపై హైప్ కూడా క్రియేట్ అయింది. ముఖ్యంగా ట్రైలర్ తో సినిమా.. క్లీన్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

అయితే రిలీజ్ దగ్గరపడుతున్న వేళ.. నిర్మాత దిల్ రాజు తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాజమండ్రిలో ఇటీవల తాము గ్రాండ్ గా నిర్వహించిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ ఫుల్ గా జరిగిందని తెలిపారు. తమకు సహకారం అందించిన ఏపీ సర్కార్ కు థ్యాంక్స్ చెప్పారు.

ఆ సమయంలో గేమ్ ఛేంజర్ మూవీ కోసం మాట్లాడారు. గేమ్ ఛేంజర్ నాకు, శంకర్ కు కంబ్యాక్ ఫిల్మ్ అని కాన్ఫిడెంట్ గా తెలిపారు. "శంకర్ గారు నాలుగేళ్ల క్రితం కథ చెప్పినప్పుడు ఏది ఫిక్స్ చేశామో అది ఉందో లేదో.. సినిమా ద్వారా ఆ స్టోరీ లైన్ డెలివరీ చేస్తున్నామా లేదో అని చాలా సార్లు చర్చలు పెట్టుకున్నాం.. అలా శంకర్ గారితో అనేక సార్లు మాట్లాడా" అని వెల్లడించారు.

"మీరు చెప్పిన కథ ఉందో లేదో చెక్ చేసుకోండి.. ఈ సినిమా మీకు, నాకు చాలా ముఖ్యం.. ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తుండడంతో హీరో గారికి కూడా ముఖ్యం.. అని శంకర్ గారిని గుర్తు చేసి పక్కాగా రెడీ చేశాం" అని చెప్పారు. కొంతకాలంగా తన జడ్జ్ మెంట్ తప్పిందనే కామెంట్లు విన్నానని, ఈ సారి ఎలా అయినా సూపర్ హిట్ కొట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయినట్లు పేర్కొన్నారు.

ఇక గేమ్ ఛేంజర్ విషయానికొస్తే.. రామ్ చరణ్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, టాలీవుడ్ హీరోయిన్ అంజలి ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకాంత్, నాజర్, సునీల్, ఎస్ జే సూర్య, సముద్రఖని సహ పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందించారు. మరి గేమ్ ఛేంజర్ మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News